సభకు అసాంఘిక శక్తులు రావొచ్చు : డీసీపీ

హైదరాబాద్ : ఈ నెల 7న నిర్వహించబోయే ఏపీ ఎన్జీవోల సభకు అసాంఘిక శక్తులు రావొచ్చు అని డీసీపీ కమలాసన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 19 షరతులతో ఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. సభలో ఎవరి మనోభావాలను కించపరిచేలా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని ఆదేశించారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే సీమాంధ్ర ఉద్యోగులు సభ పెట్టేదే ఆస్తుల విధ్వంసానికి, తెలంగాణవారిని రెచ్చగొట్టడానికేనని టీ కాంగ్రెస్ నేతలు బల్లగుద్దిచెప్తున్నరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.