సబితపై చార్జ్

sabtha
జగన్ అక్రమాస్తుల కేసు.. దాల్మియా సిమెంట్స్ వ్యవహారం
సీబీఐ ఐదో చార్జిషీట్
ఏ4 సబితా ఇంద్రాడ్డి
పెన్నా, భారతి సిమెంట్స్ వ్యవహారాల్లోనూ
నిందితురాలిగా పేర్కొనే అవకాశం

– మోసపూరిత కుట్ర, అవినీతి ఆరోపణలపై
మొత్తం 13 మంది
నిందితులపై
అభియోగపత్రం
– నాడు వైఎస్ హయాంలో గనులశాఖ మంత్రిగా
సబిత అనుచితంగా
వ్యవహరించారని
అభియోగం
– దాల్మియా సిమెంట్స్‌కు జగన్ లబ్ధి చేకూర్చారన్న సీబీఐ
– బదులుగానే జగన్ సంస్థల్లోకి
రూ.95 కోట్ల పెట్టుబడులు
– పాత్రధారిగా సబితను పేర్కొన్న దర్యాప్తు సంస్థ
జగన్ అక్రమాస్తుల కేసులో 62 పేజీలతో కూడిన ఐదో చార్జిషీట్‌లో సీబీఐ 13 మందిని నిందితులుగా పేర్కొంది. 47 మంది సాక్షుల పేర్ల జాబితాను, 53 అనుబంధ డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. తాజా చార్జిషీట్‌లోని నిందితుల వివరాలు: ఏ-1 జగన్‌మోహన్‌డ్డి, ఏ-2 విజయసాయిడ్డి, ఏ-3 పునీత్ దాల్మియా, ఏ-4 సబితా ఇంద్రాడ్డి, ఏ-5 వై శ్రీలక్ష్మి, ఏ-6 వీడీ రాజగోపాల్, ఏ-7 సజ్జల దివాకర్‌డ్డి, ఏ-8 సంజయ్‌మిత్రా, ఏ-9 నీల్‌కమల్ బేరీ, ఏ-10 జయదీప్, ఏ-11 రఘురాం సిమెంట్స్, ఏ-12 దాల్మియా సిమెంట్స్, ఏ-13 ఈశ్వర్ సిమెంట్స్.
వైఎస్ జగన్మోహన్‌డ్డి అక్రమ ఆస్తుల కేసు మరిన్ని కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటిదాకా ఈ కేసులో రాష్ట్ర మంత్రులిద్దరిని.. ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణలను నిందితులుగా పేర్కొన్న సీబీఐ తాజాగా మరో మంత్రి.. హోంమంత్రి సబితా ఇంద్రాడ్డినీ ఆ జాబితాలో చేర్చింది. సోమవారం సమర్పించిన ఐదో చార్జిషీట్‌లో ఆమెను నాలుగో నిందితురాలిగా పేర్కొంది. గతంలో వైఎస్ రాజశేఖరడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె నిబంధనలకు విరుద్ధంగా కొందరికి మేలు చేకూర్చేందుకు దోహదపడ్డారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభివూపాయపడింది. నాటి సీఎం వైఎస్ ఆమెను ప్రియతమ చెల్లెలు (చే చెల్లెమ్మ)గా భావించేవారు. అప్పట్లో చోటుచేసుకున్న అక్రమాలపై కొనసాగుతున్న దర్యాప్తులో పలువురు నేతలు, అధికారుల పేర్లు బహిర్గతమవుతున్న సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసులో మార్చి 31వ తేదీలోగా దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ, తాజాగా ఏడు అంశాల్లోని ఒకటైన దాల్మియా సిమెంట్స్ సంస్థ వ్యవహారాలపై 13 మందిని నిందితులుగా చూపిస్తూ ఐదో అభియోగపవూతాన్ని సోమవారం సాయంత్రం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరడ్డి హయాంలో దాల్మియా సిమెంట్స్ సంస్థకు సున్నపురాయి గనుల నిక్షేపాలను కేటాయించారని, అందుకు బదులుగా వైఎస్ జగన్ కంపెనీలైన భారతి సిమెంట్స్, జగతి గ్రూప్ షేర్లను దాల్మియా సిమెంట్స్ యజమానులు అత్యధికంగా వెచ్చించి కొనుగోలు చేశారని సీబీఐ వివరించింది. మొత్తం 13 మంది నిందితులపై మోసపూరిత కుట్ర, అవినీతి అభియోగాలతో ఐపీసీ సెక్షన్లలోని 120-బి రెడ్ విత్ 420, 420, 409; అవినీతి నిరోధక చట్టంలోని 9, 12, 13, 13(1) (డి) (సి), 13(2) సెక్షన్ల ప్రకారం కేసులను నమోదు చేసింది.

ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా, కుట్రతో పనులు సాధించుకునేలా పథకం ప్రకారమే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. ప్రతిఫలంగా (క్విడ్ ప్రో కో) సదరు సంస్థల నుంచి ముడుపులను పెట్టుబడుల రూపంలో జగన్ కంపెనీల్లోకి మళ్ళించారని తెలిపింది. ఇందులో ప్రధాన పాత్ర వైఎస్ జగన్‌మోహన్‌డ్డిది (ఏ1) కాగా, ఆయన అనుచరుడు విజయసాయిడ్డి (ఏ2) కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొంది. విజయసాయిడ్డి ప్రణాళికను జగన్మోహన్‌డ్డి తనకు ఉన్న ప్రాబల్యంతో అమలుచేయించగలిగారని, ప్రభుత్వంపై ఒత్తిడి ద్వారా దాల్మియా సిమెంట్స్ సంస్థకు ప్రయోజనం కలిగేట్లు వ్యవహరించారని తెలిపింది. జగన్మోహన్‌డ్డికి చెందిన భారతి సిమెంట్స్ సంస్థ ఏర్పాటుకు యంత్రాలను సమకూర్చడానికి దాల్మియా సిమెంట్స్ యజమాని పునీత్ దాల్మియా(ఏ3) సహాయం చేశారని వివరించింది. అంతేకాకుండా భారతి సిమెంట్స్ ప్రారంభం కాకముందే దాని షేర్లను రికార్డు స్థాయిలో అత్యధిక ధరను వెచ్చించి కొనుగోలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. అప్పటి ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో 407 హెక్టార్లలో సున్నపురాయి గనులను కేటాయించినందుకే ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి రూ 95 కోట్ల పెట్టుబడులు మళ్ళించినట్లు సీబీఐ పేర్కొంది. ప్రైవేట్ కంపెనీలకు నియమ నిబంధనలకు విరుద్ధంగా గనులను కేటాయిస్తూ జారీచేసిన జీవో వెనుక అప్పటి గనులశాఖ మంత్రి సబితా ఇంద్రాడ్డి (ఏ4), గనులశాఖ కార్యదర్శి వై శ్రీలక్ష్మీ (ఏ5), సంచాలకుడు వీడీ రాజగోపాల్ (ఏ6) పాత్రధారులంటూ వారిని నిందితులుగా చూపింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు జీవోలు జారీ అయినట్లు సీబీఐ పేర్కొంది.
దాల్మియా కథ..: వైఎస్ జగన్‌కు, దాల్మియా సిమెంట్స్ యాజమాన్యానికి మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల గురించి సీబీఐ తన చార్జిషీట్లో స్పష్టంగా వివరించింది. 2004 లో వైఎస్ రాజశేఖరడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని వైఎస్ జగన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొంది.

బినామీ కంపెనీలు, ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వ్యక్తులు, సంస్థల నుంచి తనకు చెందిన భారతి సిమెంట్స్, జగతి గ్రూప్‌లోకి ముడుపులను పెట్టుబడుల రూపంలో మళ్ళించారని తెలిపింది. అందులో భాగంగానే దాల్మియా సిమెంట్ వ్యవహారం చోటుచేసుకుందని పేర్కొంది. ఇందులో వైఎస్ జగన్మోహన్‌డ్డి, విజయసాయిడ్డి సూత్రధారులు కాగా, మిగతావారందరు పాత్రధారులని వివరించింది. కడప జిల్లా మైలవరం మండలంలోని తలమంచిపట్నం ప్రాంతంలో సుమారు 407 హెక్టార్ల సున్నపురాయి గనులను తమకు కేటాయించాలంటూ జయ మినరల్స్ అనే కంపెనీ గనులశాఖకు దరఖాస్తు చేసుకుంది. నిబంధనలు, సదరు కంపెనీ పూర్వాపరాలను పరిశీలించిన గనులశాఖ అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. తదనంతరం కొన్ని ఒత్తిళ్లు, ఇతర కారణాల నేపథ్యంలో కొన్ని షరతులతో అనుమతించారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ సన్నిహితుడైన సజ్జల దివాకర్‌డ్డి (ఏ7) రంగవూపవేశం చేశారు. ఆయనకు చెందిన ఈశ్వర్ సిమెంట్స్ తెర మీదకు వచ్చింది. జయ మినరల్స్‌కు సున్నపురాయి గనులను అనుమతించిన దశలోనే చెప్పలేని కారణాలతో సదరు గనులను ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయిస్తూ గనులశాఖ నుంచి జీవో జారీ అయింది. ఈశ్వర్ సిమెంట్స్ పేరిట ప్రభుత్వం జీవో జారీచేసిన కొన్నాళ్లకు దాల్మియా సిమెంట్స్‌ను ముందుకు తీసుకొచ్చారు. దాల్మియా సిమెంట్స్ తమ అనుబంధ సంస్థయేనని, తలమంచిపట్నంలో తమకు కేటాయించిన 407 హెక్టార్ల సున్నపురాయి గనులను దాల్మియా సిమెంట్స్ పేరిట బదిలీ చేయాలని గనులశాఖ అధికారులకు వినతిపత్రం అందచేశారు. ఈశ్వర్ సిమెంట్స్ నుంచి వచ్చిన వినతిపత్రం మేరకు గనులను దాల్మియా సిమెంట్స్‌కు బదలాయిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. దీంతో గనులు దాల్మియా సిమెంట్స్ పరం అయ్యాయి. ఈ పనులు చక్కబెట్టినందుకుగాను దాల్మియా సిమెంట్స్ సంస్థ యాజమాన్యం జగన్‌కు రుణపడి కొన్ని పనులు చేసింది. జగన్ ప్రారంభించే భారతి సిమెంట్స్ సంస్థకు యంత్ర పరికరాలు సమకూర్చింది. తమ నిపుణులతో సాంకేతిక సహాయం అందించింది. అంతేకాకుండా వైఎస్ జగన్‌కు చెందిన భారతి సిమెంట్స్‌లో రూ.50కోట్లు, జగతి పబ్లికేషన్స్‌లో రూ.45కోట్లు పెట్టుబడిగా పెట్టింది. 2007లో రూ.110 ఉన్న భారతి సిమెంట్స్ సంస్థ షేర్ ధరను అత్యధికంగా రూ.1440 వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ విషయంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. అగ్రక్షిశేణి సిమెంట్ కంపెనీల్లో ఒకటైన దాల్మియా సిమెంట్స్ అప్పుడే వెలుగులోకి వచ్చిన భారతి సిమెంట్స్‌లో అత్యధిక ధరను వెచ్చించి షేర్లను కొనుగోలు చేయడం ఆర్థిక రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. సీబీఐ తాజా చార్జిషీట్లలో ఈ పరిణామాలన్నింటిని వివరించింది.

మూడో మంత్రి సబితా ఇంద్రాడ్డి: రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రాడ్డిని సీబీఐ ఎట్టకేలకు నిందితురాలుగా పేర్కొనడంతో ఇప్పటివరకు జగన్ అక్రమాస్తుల కేసులో ఆమె మూడో మంత్రిగా మారారు. ఇదే కేసులో ఇదివరలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకటరమణలను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం చెంచల్‌గూడ జైలులో ఉన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు విచారణను ఎదుర్కొంటున్నారు. నాడు వైఎస్ రాజశేఖరడ్డి హయాంలో మైనింగ్ అక్రమాలు జరిగాయని, నిబంధనలకు విరుద్ధంగా గనులను కేటాయించారని ఆరోపణలొచ్చాయి. రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఐరన్ ఓర్, సున్నపురాయి, గ్రానైట్, రంగురాళ్లు, ఇసుక గనుల లావాదేవీలు జరిగాయి. రాజకీయ పరిస్థితిని శాసించే స్థాయికి మైనింగ్ వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. వైఎస్ ప్రియతమ చెల్లెలుగా పేరు పొందిన సబితా ఇంద్రాడ్డి అప్పుడు గనులశాఖ మంత్రిగా ఉన్నారు. వివిధ ప్రైవేట్ సంస్థలకు గనుల కేటాయింపు, లీజుల బదలాయింపుపై జీవోలు సబితా హయాంలోనే చోటుచేసుకున్నాయి. గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, సంచాలకుడు వీడీ రాజగోపాల్ అప్పుడు సబితకు ముఖ్య వ్యక్తులుగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే శ్రీలక్ష్మి, వీడీ రాజగోపాల్‌లపై ఓబుళాపురం మైనింగ్ కేసులో కేసులు నమోదయ్యాయి. సబితా ఇంద్రాడ్డిపైన సైతం అదే విషయంలో కేసులు నమోదు కావాల్సింది. అయితే ఓబుళాపురానికి గనుల కేటాయింపు అనంతరం జీవోలో మార్పులు, కేబినెట్ ఆమోదంతో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని చేర్చడంతో అధికారులను నిందితులుగా చేర్చిన సీబీఐ, సబితా ఇంద్రాడ్డి పేరును నిందితురాలుగా పేర్కొనలేకపోయింది. ప్రస్తుతం సిమెంట్ సంస్థ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో, గనుల కేటాయింపు వ్యవహారంలో సబితను నిందితురాలిగా చేర్చింది. దాల్మియా సిమెంట్ వ్యవహారంతోపాటు త్వరలో చార్జిషీట్ దాఖలు చేయబోయే పెన్నా సిమెంట్స్ , భారతి సిమెంట్స్ వ్యవహారాల్లోనూ సబితా ఇంద్రాడ్డిని నిందితురాలిగా పేర్కొనే అవకాశం ఉంది. గతంలోనే సబితా ఇంద్రాడ్డిని సీబీఐ ఒకసారి విచారించింది. జీవోల జారీ వెనుక ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లపై సీబీఐ మంత్రిని ప్రశ్నించింది. అయితే తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని, గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఇచ్చిన వివరణలతో సంతృప్తి చెందిన తర్వాతే ఫైళ్ల క్లియన్స్‌కు ఆమోదం తెలిపినట్లు సబితా ఇంద్రాడ్డి సీబీఐకి వివరించారు.

త్వరలో పెన్నా, భారతి సిమెంట్స్ వ్యవహారంపై చార్జిషీట్లు
జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే నాలుగు చార్జిషీట్లు దాఖలుచేసిన సీబీఐ సోమవారం ఐదో చార్జిషీట్‌ను సమర్పించింది. సీసీ-8లో ఫార్మా సంస్థలు, సీసీ-9 లో జగతి పబ్లికేషన్స్, సీసీ-10లో రాంకీ సంస్థ, సీసీ-14లో వాన్‌పిక్ అంశంపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసింది. సోమవారం దాల్మియా సిమెంట్స్ వ్యవహారంపై అభియోగపవూతాన్ని దాఖలు చేసింది. సిమెంట్ కంపెనీ వ్యవహారాలపై సీబీఐ దృష్టి సారించింది. పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపు వ్యవహారంపై సీబీఐ తన దర్యాప్తును కొనసాగిస్తుంది. గతంలో పెన్నా సిమెంట్స్ ప్రతినిధులు పలుమార్లు సీబీఐ విచారణకు విచారణకు హజరయ్యారు. అలాగే గత శనివారం మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్‌ను సైతం సీబీఐ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పెన్నా సిమెంట్స్, తదనంతరం భారతి సిమెంట్స్ వ్యవహారాలపై సీబీఐ చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.