సడక్‌బంద్‌లో ఎవరేమన్నారు?

మేమేమైనా ఉగ్రవాదులమా?
శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సడక్‌బంద్ నిర్వహిస్తున్న తమను సీమాంధ్ర ప్రభుత్వం అకారణంగా అరెస్టు చేసింది. హైదరాబాద్‌లో విధ్వంసం చేస్తున్న ఉగ్రవాదులను అరెస్టు చేయలేని ఈ సర్కార్.. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేసి జైలుకు తరలించడం సిగ్గుచేటు. సీఎం కిరణ్ తెలంగాణవాదంలేదని కేంద్రానికి తెలియజేయడానికే తెలంగాణవాదులను అరెస్టు చేయిస్తున్నారు. తామేమైనా ఉగ్రవాదులమా? పోలీసుల ప్రవర్తన అతిగా ఉంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు గుండె ధైర్యంతో ముందుకు వచ్చి తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటిచెప్పారు.
– టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
అరెస్టులు దారుణం
శాంతియుతంగా నిర్వహిస్తున్న సడక్‌బంద్ కార్యక్షికమాన్ని పోలీసులు రణరంగంగా మార్చి ఎమ్మెల్యేలతో పాటు జేఏసీ నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉన్నదని, అందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సడక్‌బంద్‌ను నిర్వహిస్తున్న తమను అరెస్టు చేయడం దారుణం.
– ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత
అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరు
అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని.. సీఎం కిరణ్ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. సడక్‌బంద్‌కు వచ్చే వేలాది మంది ఉద్యమకారులు, ప్రజలను అరెస్టు చేయించారు. వేలాది మందిని బైండోవరల పేరిట నిర్బంధించారు. దీనిని ప్రజాస్వామ్య పాలన అనరు. సైనిక పాలన అంటారు. కిరణ్ సర్కార్ హిట్లర్ పాలనను తలపిస్తున్నది.
– హరీశ్‌రావు, టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత
ఇది పోలీసు రాజ్యం
సడక్‌బంద్‌ను పోలీసులు అడ్డుకోవడం.. పోలీసు రాజ్యాన్ని తలపిస్తోంది. పోలీసులు ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత ఉధృత మవుతదనే విషయాన్ని గుర్తించుకోవాలి. పోలీసులు నిరంకుశంగా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు స్వచ్ఛందంగా సడక్‌బంద్‌లో పాల్గొని సత్తాచాటారు.
– టీ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్

సడక్‌బంద్‌ను నిర్వీర్యం చేసి తెలంగాణలో ఉద్యమంలేదని ఢిల్లీకి చాటిచెప్పేందుకు కుట్ర చేసిన సీఎం కిరణ్ ఎత్తులు తెలంగాణవాదుల ఎదుట చిత్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని విస్మరించి తెలంగాణవాదులను అరెస్టు చేస్తున్నది. శాంతియుతంగా సడక్‌బంద్‌ను చేప సన్నద్ధమైనప్పటికీ పోలీసులు మితిమీరి ప్రవర్తించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాన్ని సాధించుకుంటాం.
– టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు
వేలాది మందిని అడ్డుకున్నారు
ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గౌరవించాలి. శాంతియుతంగా ఆందోళన చేప వస్తున్న వేలాది మంది తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదు. అరెస్టులు, బైండోవర్లంటూ నిర్బంధకాండను కొనసాగించారు. ఇరవై వేల మందిని బైండోవర్‌చేశారు. ఎనిమిది వేల మందిని అరెస్టు చేశారు. ఇదా ప్రజాస్వామ్యం?
– స్వామిగౌడ్, ఎమ్మెల్సీ
బీజేపీతోనే తెలంగాణ సాధ్యం..
బీజేపీతోనే చిన్న రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే బీజేపీకే ఉంది. మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదే. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగవ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం.
– బీజేపీ నేత విద్యాసాగర్‌రావు
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తడాఖా చూపించాలి
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తడాఖా చూపించాలి. తుపాకులతో బెదిరించినా.. ఏమి జరిగినా ఉద్యమాలు ఆపొద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆకాంక్షను ఢిల్లీలో ఉన్న నాయకులకు తెలియజేయడానికి రకరకాల ఉద్యమాలు చేశాం. కిరణ్ సర్కారు ఎన్ని నక్క జిత్తులు వేసినా ఉద్యమ కారులను అణచివేయలేరు. – ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌డ్డి

తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా జరిగిన సడక్‌బంద్‌లో అడుగడుగునా ఆటంకాలను కల్గించడంలో పాటు ప్రజాస్వామ్య స్వేచ్ఛ లేకుండా చేసిన ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. డీఐజీ నాగిడ్డి, ఎస్పీ నాగేందర్‌కుమార్ నిరంకుశత్వ ధోరణితో వ్యవహరించారు. ఇది ప్రజాస్వామ్య దేశంగా లేదు.. పోలీసు రాజ్యంలా ఉంది.
– పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌డ్డి
సీఎం క్షమాపణ చెప్పాలి
సడక్‌బంద్‌ను పోలీసుల ద్వారా అడ్డుకున్న సీఎం కిరణ్‌కుమార్‌డ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సడక్‌బంద్‌లో తెలంగాణవాదులపై పోలీసులు మూర్ఖత్వంగా ప్రవర్తించారు. ఉద్యమాన్ని ఎంత రెచ్చగొడితే అంత ఎత్తుకు లేస్తుందనే విషయం సీఎం తెలుసుకోవాలి.
– ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణ్‌రావు
నిరంకుశ పాలన
తెలంగాణ ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. సడక్‌బంద్ సక్సెస్ కావడంతో ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. లేకుంటే తెలంగాణ ప్రజల చేతుల్లో మసికాక తప్పదు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కును కాలరాయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదరన్శం.
– బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ
ఎంత అణచివేస్తే అంతగా లేస్తాం
బంతిని ఎంత బలంగా కింద కొడితే అంత పైకి లేచినట్లు.. తెలంగాణ ఉద్యమకారుల్ని ఎంతగా అణచాలని చూస్తే.. మరింతగా ఉవ్వెత్తున లేస్తాం. మహిళలని కూడా చూడకుండా వారిని ఇక్కడి రాకుండా అడ్డుకున్నారు.
– తుల ఉమ, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు
డీఎంకేను చూసి నేర్చుకోవాలి
తమిళుల కోసం డీఎంకే మంత్రులు రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారు. దీన్నిచూసైనా తెలంగాణ మంత్రులు తమ తీరు మార్చుకోవాలి. తెలంగాణ కోసం రాజీనామాలు సమర్పించి ఉద్యమంలో పాల్గొనాలి. ప్రాణత్యాగాలు చేసుకున్న వారికి ఆత్మకు శాంతి చేకూరాలంటే తెలంగాణ సాధించి తీరాల్సిందే.
– కల్వకుంట్ల కవిత, జాగృతి అధ్యక్షురాలు

టీ కాంగ్రెస్ నేతలు సీఎం బూట్లు నాకుతున్నారు
ఆంధ్రపాలకుల మోచేతి నీళ్లు తాగినంత కాలం రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగుతనే ఉంటది. తెలంగాణ ప్రాంత మంత్రులకు చీము నెత్తురు ఉంటే వెంటనే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలి. కిరణ్ కుమార్ రెడ్డి బూట్లు నాకడానికి తప్ప తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దేనికీ పనికి రారు.
– అద్దంకి దయాకర్

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.