సడక్‌బంద్’కు మద్దతివ్వండి: కోదండరాం

 

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 21న చేపట్టనున్న ‘సడక్‌బంద్’ కార్యాక్రమానికి మద్ధతు ఇవ్వాలని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం బీజేపీకి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే యెండెల లక్ష్మినారాయణ, సీనియర్ నేత దత్తాత్రేయలను కలుసుకుని సడక్‌బంద్‌కు మద్ధతు విషయంపై చర్చించారు. దీనికి బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారని అనంతరం విలేకరులతో కోదండరాం అన్నారు.

తెలంగాణనేతలు అవిశ్వాసాన్ని వ్యక్తం చేయాలి: కోదండరాం
ప్రభుత్వంపై తెలంగాణ ప్రాంత నేతలు అవిశ్వాసం వ్యక్తం చేయాలని, విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇవ్వాలని కోదండరాం కోరారు. ఏప్రిల్ మూడో వారంలో ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.

This entry was posted in TELANGANA BOOKS, Top Stories.

Comments are closed.