సడక్‌బంద్’కు టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్ధతు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ‘సడక్‌బంద్’ కార్యాక్రమానికి ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ఈమేరకు ఇవాళ జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఒక తీర్మానం చేశారు. 21 నిర్వహించబోయే ‘సడక్‌బంద్’ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనాలని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారని పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నరసింహారెడ్డి తెలిపారు.

‘సడక్‌బంద్’పై దుష్ప్రచారం: నాయిని
సడక్‌బంద్ కార్యక్రమంపై సీమాంధ్ర నేతలు దుష్ప్రచారం చేస్తోన్నారని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. సడక్‌బంద్ విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగిస్తుందన్నది ఉత్తమాటేనని తెలిపారు. సడక్‌బంద్‌లో తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణవాదులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, త్వరలోనే విజయవాడ హైవేను కూడా దిగ్బంధిస్తామని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.