సడక్‌పై తెలంగాణ తడాఖా

poralupolice
శంషాబాద్ టు అలంపూర్..
సడక్ బంద్ గ్రాండ్ సక్సెస్
భారీగా నిలిచిపోయిన వాహనాలు
తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించిన సర్కార్
అరెస్టులు.. బైండోవర్లు.. దౌర్జన్యం.. లాఠీచార్జి
అణచివేతకు ఆద్యంతం కుట్రలు.. ఛేదించిన ఉద్యమశక్తులు
తెలంగాణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచేందుకు టీజేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా సడక్ బంద్ నిర్వహించగా పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడి టీ జేఏసీ, టీఆర్‌ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్షికమాలను నిర్వహించాలి. అరెస్టు చేసిన తెలంగాణవాదులు, నేతలను వెంటనే విడుదల చేయాలి.
– టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
సడక్‌పై తెలంగాణ తన తడాఖా చాటింది! కరకు ఖాకీ బూట్లతో ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం ఎన్ని ఎత్తులు వేసినా.. అడుగడుగునా అరెస్టులతో కార్యక్షికమాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నించినా.. తట్టుకుని నిలబడింది.. ఎదుర్కొని.. విజయం సాధించింది! టీజేఏసీ పిలుపు మేరకు శంషాబాద్ నుంచి అలంపూర్ వరకూ 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించింది! సడక్ బంద్‌ను సక్సెస్ చేసింది! ఉద్యమకారులకు పోటీ అన్నట్లు మోహరించిన పోలీసుల కళ్లుగప్పి.. నిర్దేశించుకున్న పాయింట్ల వద్దకు చేరిన జనం జై తెలంగాణ నినాదాలు మార్మోగించారు! ముందస్తు అరెస్టులు, బైండోవర్లతో కట్టడి చేయగలమని ప్రభుత్వం భావించినా.. కార్యక్షికమ సారథులు టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి సహా ముఖ్యనాయకత్వాన్ని అరెస్టు చేశామని సంబరపడినా.. 1777 మంది కార్యకర్తలను అరెస్టు చేసి 57 కేసులు నమోదు చేశామని సంతోషంలో మునిగినా.. బంద్ విజయవంతాన్ని ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది! ఆ కసిని ఉద్యమకారులపై తీర్చుకున్న పోలీసులు వివిధ పాయింట్లలో ఆందోళనకారులపై రెచ్చిపోయారు. యథేచ్ఛగా లాఠీచార్జి చేశారు. కార్యక్షికమానికి వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అరెస్టులు, లాఠీచార్జీలను లెక్కచేయని ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్షను అనుకున్నదానికంటే బలంగానే వినిపించారు. ఈ కార్యక్షికమాన్ని అడ్డుకునేందుకు మూడు జిల్లాల నుంచి 8 వేల పోలీసు బలగాలను రప్పించినా.. హైదరాబాద్ రేంజి డీఐజీ నాగిడ్డి ఇక్కడ మకాం వేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసినా.. జనం వెనుకంజ వేయలేదు. శంషాబాద్, షాద్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్, కొత్తకోట, అలంపూర్ ప్రాంతాల్లో జాతీయరహదారిని దిగ్బంధించారు. అలంపూర్, జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమంపై పోలీసులు జులుం ప్రదర్శించడంతో ఆగ్రహం చెందిన ఉద్యమకారులు పలు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కొత్తకోట మండలంలోని పలు గ్రామాల రైతులు ఎడ్లబండ్లను జాతీయరహదారిపై ఉంచి సడక్‌బంద్ చేపట్టారు. బండ్లను తీసేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.

నేతలపై అక్రమ కేసులు
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్‌డ్డి, టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్, టీఎంయూ రాష్ట్ర నాయకుడు అశ్వత్థామడ్డి ఆధ్వర్యంలో అలంపూర్ టోల్‌గేట్ వద్ద సడక్‌బంద్‌లో పాల్గొన్నారు. పోలీసులు వీరిని అడ్డుకుని.. కర్నూలు జిల్లా మీదుగా మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన వారిపై పోలీసులు 147, 148, 341, 188, 109ఆర్‌డబ్లూ(డ్‌విత్)149 ఐపీసీ 3 అండ్ 4 పీడీపీపీ అనే సెక్షన్‌ల పజా జీవనానికి ఆటంకం కల్గించడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం, విధులకు ఆటంకం కల్గించడం, ఆస్తులు ధ్వంసం చేసేందుకు ఉత్సాహపర్చడం) కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వీరిని అలంపూర్ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న జడ్జి శుభవాణి వీరికి ఏప్రిల్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించారు. వీరి తరుఫున అడ్వకేట్ జేఏసీ బెయిల్ పిటిషన్ వేసినా సమయం గడిచిపోవడంతో జడ్జి బెయిల్ మంజూరు చేయలేదు. బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు విం టామని చెప్పారు. వెంటనే వారిని రాత్రి 9:15 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తీసుకువచ్చారు. జైలు వద్దకు తెలంగాణవాదులు భారీగా తరలివచ్చారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.