సచివాలయ శాఖలు కట్!

రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. శాఖల వారీగా విభజన, పంపకాల కోసం అధికారులతో ఏర్పాటైన 14 కమిటీలు తమకు అప్పగించిన పనిని దాదాపు పూర్తిచేశాయి. ప్రధాన శాఖలకు చెందిన సమగ్ర నివేదికలను అపెక్స్ కమిటీ అయిన ప్రణాళిక సంఘం కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని కమిటీకి అందజేశాయి. దీంతో విభజన ప్రక్రియపై క్రమంగా స్పష్టత వస్తోంది. తాజాగా ఇరు రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ శాఖల విభజన పూర్తయింది. 

ఉమ్మడి రాష్ట్రంలోని 36 ప్రభుత్వ శాఖలను 29 శాఖలుగా కుదిస్తూ విభజన కమిటీ నివేదికను రూపొందించింది. ఇక కీలకమైన సచివాలయం, శాఖాధిపతుల పోస్టుల గుర్తింపు కూడా పూర్తయింది. అన్ని శాఖలతో దశలవారీగా సంప్రదింపులను జరిపిన వినోద్‌కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలోని రీ స్ట్రక్చరింగ్ కమిటీ తన తుది ముసాయిదా నివేదికను ఎస్పీ టక్కర్ కమిటీకి అందజేసింది. సచివాలయంలో మొత్తం 4,079 పోస్టులు ఉన్నట్టుగా ఈ నివేదికలో గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 2,307 పోస్టులను, తెలంగాణ రాష్ర్టానికి 1,772 పోస్టులను కేటాయించారు.

శాఖలవారీగా పోస్టుల కేటాయింపు, ఏయే శాఖల్లో పనులు ఎలా జరగాలి…లాంటి అంశాలతోపాటు శాఖల సర్దుబాటును కూడా నివేదికలో ఖరారు చేశారు. 13ః10 నిష్పత్తి ప్రాతిపదికగా శాఖల వారీగా పోస్టుల కేటాయింపును చేపట్టాలని నిర్దేశించారు. ఇప్పుడున్న అధికారులతోనే విభజన తర్వాత ఇరు రాష్ర్టాల్లో పాలన కొనసాగించేందుకు అవసరమైన కసరత్తును చేశారు. ఇందులోభాగంగా సారూప్యత ఉన్న శాఖల్లో కమిషనర్, ముఖ్య కార్యదర్శి వంటి పోస్టులను ఒక్కరికే అప్పగించాలని ప్రతిపాదించారు. దీంతో అనవసర వ్యయం, కాలయాపన నివారించవచ్చని నిర్ధారించారు. అధికారుల పంపిణీ అనంతరం ఇప్పుడున్న ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ అధికారులతోనే ఇరు రాష్ర్టాల పాలనా పనులను చక్కబెట్టాలని రీ స్ట్రక్చరింగ్ నివేదికలో స్పష్టం చేశారు.

శాఖల కుదింపు లేదా రద్దు

రాష్ట్ర సచివాలయంలో ఇప్పటివరకు ఉన్న 36 ప్రభుత్వ శాఖలను 29 శాఖలకు కుదించారు. ప్రాధాన్యంలేని, అమల్లోలేని శాఖలను రద్దు లేదా విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను ఇండస్ట్రీస్ విభాగంలో చేర్చారు. ఆర్థిక శాఖలో మూడు విభాగాలున్నాయి. ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శులున్నారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖలోని మూడు విభాగాలను కుదించి ఒక్కటే విభాగంగా రూపొందించాలని నిర్ణయించారు. రెయిన్ షాడో విభాగం గత కొన్నేళ్లుగా నామ్‌కే వాస్తే అన్నట్టు ఉండటంతో దానిని పూర్తిగా రద్దు చేయాలని రీస్ట్రక్చరింగ్ కమిటీ నివేదికలో నిర్దేశించారు.

10లోపు శాఖాధిపతుల వివరాలు

ఇప్పటివరకు సచివాలయంలోని పోస్టులు, శాఖల వివరాలపై అధ్యయనం జరిపి నివేదిక అందించిన వినోద్‌కుమార్ అగర్వాల్ కమిటీ తాజాగా శాఖాధిపతుల కార్యాలయాలు(హెచ్‌వోడీ), వాటి పోస్టులపై దృష్టి పెట్టింది. వీటన్నింటినీ ఈనెల 10లోగా పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా రీ స్ట్రక్చరింగ్ కమిటీ ప్రతిరోజూ ఆయా శాఖలతో సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించింది. ఆ

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.