సచివాలయం ఖాళీ!

హైదరాబాద్, మార్చి 4: రాష్ట్రపతి పాలనతో పరిపాలనా వ్యవస్థ అంతా రాజ్‌భవన్‌కు మారింది. దాంతో ప్రతిరోజూ వేలాది మందితో కిటకిటలాడుతూ కనిపించే రాష్ట్ర సచివాలయం బోసిపోతోంది. ఉన్నతాధికారులు, ఉద్యోగులు మినహా మరెవరూ కనిపించడం లేదు. మంగళవారం మంత్రుల ఛాంబర్లు కూడా ఖాళీ అయ్యాయి. డీ బ్లాక్‌లోని కే జానాడ్డి, జే గీతాడ్డి, దానం ఛాంబర్లతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా కొనసాగిన సీపీఆర్వో ఛాంబర్‌లోని సామాక్షిగిని తరలించారు. ఉదయం నుంచే కుర్చీలు, బీరువాలను వాహనాల్లో తీసుకెళ్లడం ప్రారంభమైంది. సీమాంధ్ర మంత్రుల ఛాంబర్లు ఇంతకు ముందే ఖాళీ అయ్యాయి. మిగతా వారు కూడా ఈ నెల ఏడో తేదీలోగా ఖాళీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి ఆదేశాలు జారీ చేశారు. నామినేటెడ్ పోస్టులు పొందిన వారు రాజీనామా చేయాల్సిందేనని గవర్నర్ నర్సింహన్ ఆదేశాలు జారీ చేశారు.

రాజీవ్ యువ కిరణాలు పథకం చైర్మన్ కేసీడ్డి రాజీనామా ఇవ్వగా మిగతా వారిలో స్పందన రాలేదు. సచివాలయంలో తెలుగు భాషాభివృద్ధి, మైనార్టీ కమిషన్, 20 సూత్రాల అమలు పథకం వంటి పలు నామినేటెడ్ పోస్టుల ప్రతినిధులకు ఛాంబర్లు ఉన్నాయి. వాటిని ఇంకా ఖాళీ చేయలేదు. ఖాళీ చేసిన ఛాంబర్లకు మాత్రం అధికారులు దగ్గరుండి తాళాలు వేయిస్తున్నారు.

సీ బ్లాక్ జీఏడీ ఆధీనంలోకి.:
సచివాలయంలో అత్యం త కీలకమైన సీ బ్లాక్‌ను సాధారణ పరిపాలన శాఖ ఆధీనంలోకి తీసుకోనుంది. ఈ బ్లాక్‌ను రాష్ట్రపతి పాలన కొనసాగినంత కాలం మూసేస్తారని తెలిసింది. ఇదే బ్లాక్‌లో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తారో నిర్ణయించలేదు. ఇక్కడి మీడియా పాయింట్‌ను ఎత్తేస్తారని అధికారులు చెబుతున్నారు. సచివాలయంలో త్వరలోనే మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు. కాగా విభజన ప్రక్రియను వేగవం తం చేసే పనిని వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలతో జరపాల్సిన సమీక్షలను ఎక్కడినుంచి నిర్వహిస్తారనేది స్పష్టం కాలేదు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.