సకలం బంద్

-తెలంగాణలో రోడ్డెక్కని బస్సులు, పట్టాపూక్కని ఎంఎంటీఎస్ రైళ్లు
-తెరుచుకోని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు
విధులు బహిష్కరించిన న్యాయవాదులు, ఉద్యోగులు
– ర్యాలీలు, రాస్తారోకోలతో కదంతొక్కిన కార్మికులు, కర్షకులు
-పాల్గొన్న జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, వివిధ విద్యార్థి సంఘాలు
-సీఎం, డీజీపీ దిష్టిబొమ్మలు, సీమాంధ్ర పత్రికల దహనం
-సీమాంధ్ర చానళ్ల ప్రసారాల నిలిపివేత
-బాల్కసుమన్ సహా వందలాది మంది అరెస్టు
టీ మీడియా, నెట్‌వర్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతగులు తూ సమైక్యవాదులను ప్రోత్సహిస్తున్న సీఎం కిరణ్ తీరును నిరసిస్తూ టీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. హైదరాబాద్‌లో తెలంగాణ శాంతి ర్యాలీకి అనుమతివ్వకుండా ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడంపై తెలంగాణవాదులు సర్కారుపై నిప్పులు చెరిగారు.image
24 గంటల బంద్‌లో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, పెట్రోల్‌బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు బంద్‌లో పాల్గొనడంతో ఒక్క బస్సూ రోడ్డెక్కలేదు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాపూక్కలేదు. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, కేటీపీపీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రభుత్వ వైఖరిని నిరసించారు. జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, న్యూ డెమోక్షికసీ, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో ఉద్యోగ, విద్యార్థి, పలు ప్రజాసంఘాలు, కార్మికులు, కర్షకులు ర్యాలీలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలతో కదంతొక్కారు. పది జిల్లాల్లో సీఎం, డీజీపీ దిష్టిబొమ్మలతోపాటు సీమాంధ్ర పత్రికలను దహనం చేసి నిరసన తెలిపారు. పలుచోట్ల సీమాంధ్ర న్యూస్ చానళ్ల ప్రసారాలను నిలిపివేశారు.

డిపోలకే పరిమితమైన బస్సులు
వరంగల్‌లో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో బైక్ ర్యాలీ చేశారు. కేయూ విద్యార్థులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. అమరవీరుల స్తూపం వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. ఎంజీఎం సెంటర్‌లో వైద్యులు, కేయూ సర్కిల్‌లో తెలంగాణవాదులు సీమాంధ్ర పత్రికలను దహనం చేశారు. బచ్చన్నపేటలో రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాలో ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలు పట్టారింగ్‌లను తొలగించడంతో ఆరుగురిని బైండోవర్ చేశారు. భూపాలపల్లిలో ఓ చిట్‌ఫండ్ కార్యాలయంపై దాడిచేశారు. కేటీపీపీలో కార్మికులు విధులు బహిష్కరించారు. కరీంనగర్ జిల్లాలో 920 పైగా బస్సులు నడవలేదు. సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో 621 బస్సులు రోడ్డెక్కలేదు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎనిమిది మంది ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఖమ్మం రీజియన్ ఆర్టీసీ రూ.54 లక్షల ఆదాయాన్ని కోల్పోయింది. కేటీపీఎస్ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. నల్లగొండ జిల్లాలోని 729 బస్సులు బయటకు రాలేదు. సీమాంధ్ర విద్యార్థులతో హైదరాబాద్ సభకు వెళ్తున్న బస్సును వెనక్కి పంపాలని వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద షోయబ్ అనే యువకుడు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జేఏసీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో రాస్తారోకో చేశారు. మెదక్ జిల్లా సంగాడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 550 బస్సులు రోడ్డెక్కలేదు. కలెక్టరేట్లో ఐసీడీఎస్ సమావేశాన్ని ఉద్యోగులు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో సాక్షి ప్రతులను దహనం చేశారు. నిజామాబాద్‌లో బంగారు వర్తక సంఘం దుకాణాలను బంద్ చేసింది.

డిచ్‌పల్లిలో టీయూ ప్రొఫెసర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎన్‌డీఎస్‌ఎల్ చక్కెర ఫ్యాక్టరీ ఎదుట బీజేపీ ధర్నా చేసింది. రంగాడ్డి జిల్లాలో జర్నలిస్టులపై దాడికి నిరసనగా టీజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. హైదరాబాద్‌లో 3,700 బస్సులు రోడ్డెక్కలేదు. రవాణావ్యవస్థ పూర్తిగా స్థంభించింది. నిజాం కాలేజీ హాస్టల్‌లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్, బాబాఫసియొద్దీన్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అరెస్టు చేశారు. పోలీసుల భద్రత మధ్య ఐమాక్స్‌ను నడిచింది. గ్రేటర్ పరిధిలో వేలాది పరిక్షిశమలు మూసివేశారు. ఐటీ, కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలు పాల్గొనడం ప్రత్యేకం. జీహెచ్‌ఎంసీ కార్మికులు విధులను బహిష్కరించారు. ఆరాంఘర్ చౌరస్తాలో రాస్తా రోకోతో రాయలసీమ నుంచి వచ్చే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ , వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఏజీ కాలేజీ ఎదుట జాతీయ రహదారిపై, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో న్యూడెమోక్షికసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా గోవర్ధన్, సంధ్య, విమల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. బంద్ ప్రభావంతో నగరంలో రోడ్లన్న నిర్మానుష్యంగా కనిపించాయి. వందలాది మందిని అరెస్టులు చేశార

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.