సంసద్ యాత్రతో కేంద్రం కళ్లు తెరిపిస్తం:జేఏసీ

హైదరాబాద్ : తెలంగాణ అంశంపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునే దిశగా తెలంగాణ రాజకీయ జేఏసీ ‘సంసద్ యాత్ర’ను చేపట్టనుంది. ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలో 2 వేల మందితో సంసద్ యాత్ర చేపడుతామని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సంసద్ యాత్రతో కేంద్రం కళ్లు తెరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం అమరవీరుల ఆత్మత్యాగాలను అవమానిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ యాత్ర అందరికీ కనువిప్పు కలిగించేలా ఉంటుందన్నారు.

చిన్న రాష్ట్రాల ప్రదాత అంబేద్కర్
చిన్న రాష్ట్రాల ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కోదండరాం కొనియాడారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటును స్వాగతించిన అంబేద్కర్ జయంతిని ఈ నెల 14న ఘనంగా జరుపుకోవాలని కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆదర్శాలకు లోబడి ముందుకెళ్తామని ఆయన చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.