సంసద్ యాత్రకు బీజేపీ మద్దతు

tjac-bjp
– టీ జేఏసీ నేతలకు కమలం నేతల హామీ
– యాత్రతో తెలంగాణ గొంతుక వినిపిస్తాం: దేవీవూపసాద్
సంసద్ యాత్ర ద్వారా ఢిల్లీలో బలమైన గొంతుకను వినిపిస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ జీ.దేవీవూపసాద్‌రావు అన్నారు. శుక్రవారం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జేఏసీ ప్రతినిధుల బృందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి, జాతీయ నేతలు బండారు దత్తావూతేయ, సీహెచ్ విద్యాసాగర్‌రావు, తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ టీ.రాజేశ్వర్‌రావు, కోచైర్మన్ సీ అశోక్‌కుమార్ యాదవ్, తదితరులతో సమావేశమయ్యారు. సంసద్ యాత్రలో పాల్గొని, పూర్తి సహకారాన్ని అందించాలని కోరగా, అందుకు బీజేపీ నాయకులు సానుకూలంగా స్పందించారు. సంసద్ యాత్రకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామినిచ్చారు. భేటీ అనంతరం దేవీవూపసాద్‌రావు మాట్లాడుతూ ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించనున్న సంసద్ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ చేస్తున్న మోసాన్ని ఎండగడతామన్నారు. ప్రస్తుత చివరి పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని బీజేపీ నాయకులను కోరినట్లు ఆయన తెలిపారు. సంసద్ యాత్రకు జేఏసీలోని అన్ని భాగస్వామ్య పార్టీలు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టిస్తాం : రాజేశ్వరరావు
సంసద్ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తామని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ టీ రాజేశ్వర్‌రావు అన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. టీ.మంత్రులు తెలంగాణ కోసం బయటకు వచ్చి పోరాడాలని ఆయన సూచించారు. సంసద్ యాత్రకు బీజేపీ సంపూర్ణ మద్దతునిస్తోందని తెలిపారు. విలేకరుల సమావేశంలో టీజేఏసీ అధికార ప్రతినిధులు సీ.విఠల్, కత్తి వెంకటస్వామి, స్టీరింగ్ కమిటీ సభ్యులు మామిడి నారాయణ, మాదు సత్యం, వేల్పూర్ పవన్‌కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లాడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ప్లాన్‌కు టీఆర్‌ఎస్ సహకరించింది: హరీశ్‌రావు
సీఎం కిరణ్‌కుమార్‌డ్డి రాజకీయాలు మానుకొని ప్రజల కష్టాలపై దృష్టిని సారిస్తే మంచిదని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత తన్నీరు హరీష్‌రావు సూచించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్‌ను టీఆర్‌ఎస్ అడ్డుకోవాలని చూసిందని సీఎం ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సభలో బురదచల్లే ప్రయత్నం చేశారని, కానీ సబ్‌ప్లాన్‌కు టీఆర్‌ఎస్ పూర్తిగా సహకరించిందని ఆయన తెలిపారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నీచ ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, దళిత పాలసీని ప్రకటించిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్సేనని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీలు పెరగడానికి టీఆర్‌ఎస్ చేసిన కృషేనని పేర్కొన్నారు. సబ్‌ప్లాన్‌పై ఎవరి చిత్తశుద్ధి ఏమిటో అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. సబ్‌ప్లాన్‌కు టీఆర్‌ఎస్ పూర్తిగా సహకరించిందని హరీష్‌రావు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.