‘సంసద్‌యాత్ర’ గ్రాండ్‌సక్సెస్: కోదండరాం

న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న చేపట్టిన ‘సంసద్‌యాత్ర’ ముగిసింది. తాము చేపట్టిన ‘సంసద్‌యాత్ర’ విజయవంతమైందని జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ ధర్నాలో పాల్గొన్న తెలంగాణ నేతలకు తెలంగాణ వాదులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రెండు రోజలపాటు సాగిన ఈ ఆందోళన కార్యక్రమం ఇవాళ సాయంత్రం పూర్తయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఢిల్లీ ప్రభుత్వానికి తెలియజేయడానికి చేపట్టిన ఈ ధర్నాలో సుమారు మూడు వేల మంది తెలంగాణ వాదులు పాల్గొన్నారు. కార్యక్రమం సంపూర్ణంగా పూర్తయినట్టు జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ధర్నాకు ఎంతో మంది జాతీయ నాయకులు వచ్చి మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా కేంద్రం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.