‘సంసద్’తో ఉద్యమం ఉధృతం: కోదండరాం

సంసద్ యాత్రతో ఢిల్లీలో తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటి ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని జేఏసీ చైర్మన్ కోదండరాం పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో ఆయ న మాట్లాడారు. 29,30 తేదీల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అనివార్యమని నేడు అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాయని చెప్పారు. యూపీఏ భాగస్వామ్య పార్టీల పెద్దలను కలిసి తెలంగాణలోని పరిస్థితులు, రాష్ట్ర ఆవశ్యకతను వివరించి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు కాగానే చలో అసెంబ్లీ చేపడతామని, జేఏసీ భాగస్వామ్య శ్రేణులు, ప్రజలు కార్యక్షికమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చలో అసెంబ్లీకి తెలంగాణవాదులు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం సాగుతోందన్నారు. బీబీనగర్ నిమ్స్ వంటి తెలంగాణ ప్రాజెక్టులపై వివక్షను ఢిల్లీ పెద్దల ముందుంచుతామన్నారు. చలో అసెంబ్లీని సక్సెస్ చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.