సంఘాలు ఎక్కడ పడుకున్నయి

విద్యార్థులకు టికెట్ ఇవ్వకుంటే భవన్ లను ఆక్రమించుకుంటం. ఉద్యమంలో ముందున్న ఉద్యోగులను, అడ్వకేట్లను పార్టీలు మరవొద్దు. బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీని ఓడిస్తం.. బడుగులకు టికెట్ నిరాకరిస్తే ఊరుకోం. బీసీ అభ్యర్థులను నిలబెట్టిన పార్టీకే మా మద్దతు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు సీట్లివ్వకుంటే ఆ పార్టీలను భూస్థాపితం చేస్తమని ఎన్నికలకు ముందు విద్యార్థి సంఘాలు, కులసంఘాలు, బహుజనసంఘాల నేతలు డైలాగులు కొట్టిన్రు. ఇప్పుడు టీఆర్ఎస్ బడుగుబలహీనవర్గాలకు, విద్యార్థులకు సీట్లు కేటాయించింది. హుజురాబాద్ లో ఈటెలకు,  హుజూర్ నగర్ లో  బీసీ వర్గానికి చెందిన శంకరమ్మకు, షాద్ నగర్ లో అంజయ్య యాదవ్ కు, భువనగిరిలో బూర నర్సయ్య, సంగారెడ్డిలో పద్మశాలి నేతకు, భూపాలపల్లిలో మధుసూదనాచారితో పాటు ఇంకా చాలా చోట్ల బీసీలకు, రిజర్వేషన్ సీట్లలో మాదిగ, మాల వర్గాలకు సీట్లు కేటాయించింది. కరీంనగర్ లో  ఉద్యమంలో ముందున్న బీసీ నేత పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. బీసీ సంఘాల నేతలు ఎక్కడ పడుకున్నరు. ఎన్నికల ముందు వార్నింగ్ లు ఇవ్వడం కాదు. టికెట్ తెచ్చుకన్న అభ్యర్థులకు మీ మద్దతేది? మీరు వాళ్ల తరపున ఎక్కడ ప్రచారం చేస్తున్నరు. బడుగు బలహీన వర్గాల నేతలు అభ్యర్థుల కోసం ప్రచారం చేయకుండా ఎక్కడున్నరు? పెద్దపల్లిలో సుమన్, సత్తుపల్లిలో పిడమర్తి రవికి, తుంగతుర్తిలో కిశోర్ కు టీఆర్ఎస్ టికెట్లు కేటాయించింది. విద్యార్థి సంఘాలు ఏమైనయి. విద్యార్థి సంఘాల నేతల తరపున ప్రచారం ఎక్కడ చేస్తున్నరు. ఉద్యోగుల సంఘం తరపున మహబూబ్ నగర్ లో టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ కు ఉద్యోగులు అండగా నిలబడ్డరా?మహిళలకు టీఆర్ఎస్ 10కి పైగా సీట్లను కేటాయించింది. మహిళా అభ్యర్థుల తరపున మహిళా సంఘాలు ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు కనిపించడంలేదు.

కేవలం అడ్వకేట్లు మాత్రమే తమ అభ్యర్థిని గెలిపించడానికి కష్టపడుతున్నరు. పరకాల టీఆర్ఎస్ అభ్యర్థి అడ్వకేట్ జేేఏసీ నేత సహోదర్ తరపున లాయర్లు ప్రచారం చేస్తున్నరు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.