షిండే.. కొత్త బిచ్చగాడు

-కాంగ్రెస్‌ది మళ్లీ మోసమే.. ఎన్నిసార్లు అఖిలపక్షం?
-ప్రతిపక్షంకాదు కానీ… కాంగ్రెస్‌కు బంగాళాఖాతంలో స్థానం
-డిసెంబర్ 9 ‘వాగ్దాన భంగ దినం’లో సీపీఐ నేత నారాయణ
కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఆయనను కొత్త బిచ్చగాడిగా అభివర్ణించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలకు సిగ్గుం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలంగాణపై తమ సొంత అభివూపాయాలు ప్రకటించాలని సవాల్ విసిరారు. డిసెంబర్ 9 తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి మూడేళ్లు గడిచిన సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో ‘వాగ్దాన భంగదినం’ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన నారాయణ మాట్లాడారు. ఎన్నిసార్లు అఖిలపక్షం నిర్వహిస్తారని.. మళ్లీ అఖిలపక్షం పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ‘‘ఇప్పుడు కొత్త బిచ్చగాడు (సుశీల్‌కుమార్ షిండే) వచ్చి చెప్పమంటున్నాడు. గతంలో పాత బిచ్చగాడు (చిదంబరం) ఉన్నప్పుడే చెప్పాం. మంత్రులు మారినప్పుడల్లా.. ప్రభుత్వ విధానాలు మారవు. కొత్తమంత్రి వచ్చినప్పుడల్లా మొదటి నుంచి తిరగదోడాల్సిన పనిలేదు. తెలంగాణ ఎంపీలు ఇంకా అధిష్ఠానం అంటే వారిని దిష్టిబొమ్మలను కాల్చినట్టుగా ప్రజలు కాల్చివేస్తారు.’’ అని ఆయన హెచ్చరించారు. ‘‘ఇప్పటికే కేంద్రం రెండుసార్లు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. అన్ని పార్టీలు అభివూపాయం చెప్పాయి.

చెప్పాల్సింది కాంగ్రెస్సే. ఆ పార్టీ అభివూపాయం చెప్పకుండాఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం శూన్యం’’అని అన్నారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఎంపీలు మధుయాష్కీ, లగడపాటి రాజగోపాల్ ప్రాంతాల వారిగా మాట్లాడడంపై ఆయన మండిపడ్డారు. ప్రాంతాల వారిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని ఆరోపించారు. సిగ్గుంటే కాగ్రెస్‌కు రాజీనామా చేసి తమ అభివూపాయాలు ప్రకటించుకోవాలని సూచించారు. అణు ఒప్పందం, ఎఫ్‌డీఐ అమలుకు అడ్డురాని ఏకాభివూపాయం, తెలంగాణ విషయంలోనే వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. 2009లో చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటుకు వెంటనే రోడ్‌మ్యాప్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలోనైనా కూర్చుంటామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పడం ముందస్తుగానే ఓటమిని ఒప్పుకున్న నారాయణ అన్నారు. అయితే.. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, బంగాళాఖాతంలో మాత్రం స్థానం దక్కుతుందని తెలిపారు. కార్యక్షికమంలో నాయకులు రాంనర్సింహారావు, నర్సింహా, డీ సుధాకర్ సహా పలువురు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.