షిండేది నాలికా.. తాటిమట్టా- నారాయణ

NARAYANA-PC
మాటమార్చిన షిండేపై నారాయణ ఫైర్
– ప్రధాన ప్రతిపక్షంగా
టీడీపీ వైఫల్యం చెందిందని ఆరోపణ
‘‘తెలంగాణపై ఆఖరి అఖిలపక్షమని.. నెల రోజుల్లో తేల్చివేస్తామని నమ్మకంగా చెప్పి మాట మార్చిన కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేది నాలికా.. తాటిమట్టా’’ అంటూ సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన శుక్షికవారం పార్టీ ప్రధాన కార్యాలయం అజయ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 8 ప్రధాన పార్టీలు షిండే నిర్వహించిన అఖిలపక్షంలో పాల్గొని.. తెలంగాణపై దాదాపు ఒకే రకమైన అవగాహనకు వచ్చాయన్నారు. తుది నిర్ణయం కేంద్రానిదే అని కూడా చెప్పాయని గుర్తుచేశారు.

అప్పుడు నెల రోజుల్లోపు నిర్ణయం తీసుకుంటామని మాట ఇచ్చిన హోం మంత్రి..గడువు దాటిన తర్వాత ఏకాభివూపా యం కుదరలేదనడం అబద్ధపు మాటలకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ సమస్యను నాన్చడం వల్ల రాష్ట్రం లో పాలన స్తంభించిపోయిందని, ఇకకైనా తేల్చకపోతే మరింత దిగజారుతుందని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈనెల 25 నుంచి 31వరకు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నారాయణ తప్పుబట్టారు.ఈ వ్యవహా రంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ వైఫల్యం చెం దిందని పేర్కొన్నారు.ఇప్పుడు గండం గట్టెక్కిందని మీసాలు తిప్పుతున్న సీఎంను ఏప్రిల్‌లో ప్రారం భం కానున్న అసెంబ్లీసమావేశాల్లో నిలదీస్తామ న్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.