శ్రుతిమించిన సమైక్య ఆగడాలు

సమైక్యవాదుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. రాయలసీమలో తెలంగాణవాసులపై దాడులు, దౌర్జన్యాలకు బరితెగిస్తున్న విష యం తెలిసిందే. చుట్టూ మనవాళ్లే ఉన్నారనుకుంటే రెచ్చిపోతున్న సీమ పౌరుషం, వ్యతిరేక వర్గం వచ్చాక తోకముడుస్తోంది. మంగళవారం పాలమూరు విద్యార్థికి ఈ అనుభవం ఎదురైంది. గద్వాలకు చెందిన బీటెక్ విద్యార్థి రవీందర్‌డ్డి వ్యక్తిగత పనిపై మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. తిరిగి గద్వాలకు వచ్చేందుకు కాచిగూడ నుంచి చెన్నైకు వెళ్లే చెన్నై ఎక్స్‌వూపెస్ ఎక్కి సీటు కోసం ప్రయత్నించినా దొరకలేదు. హైదరాబాద్ నుంచి రైలులో వస్తున్న అనంతపురం జిల్లా కు చెందిన యువ ఇంజినీర్ రమేశ్ జోక్యం చేసుకొని రవీందర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. రాయలసీమ వాళ్ల ను తెలంగాణ వాళ్లు ఏమీ చేయలేరంటూ దౌర్జన్యంగా వ్యవహరించాడు. గద్వాల దగ్గరకు వస్తున్నా అతడి తీరు లో మార్పురాలేదు. జై సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర జిందాబాద్ అని అంటూ గట్టిగా నినాదాలు చేయడం..అతనికి కడపకు చెందిన ఓ ఫొటోక్షిగాఫర్ వంతపాడటంతో ఇంకా రెచ్చిపోయాడు. తోటి ప్రయాణికులు సర్దిచెప్పినా ఆగలేదు. అప్పటి వరకు ఓపిక పట్టిన రవీందర్, ఇక లాభం లేదనుకుని గద్వాలకు చెందిన విద్యార్థి సంఘాలకు సమాచారం చేరవేయగా, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.