సినీ నటుడు శ్రీహరి కన్నుమూత

 సినీ నటుడు శ్రీహరి కన్నుమూసిన్రు. కాలేయవ్యాధితో బాధపడుతున్న శ్రీహరి ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించిన్రు. కుబుసం వంటి ఎన్నో సందేశాత్మక చిత్రాల్లో నటించిన శ్రీహరి మరణం చిత్రసీమకు తీరని లోటు మిగిల్చింది.  బాలానగర్ లో పెరిగిన శ్రీహరి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నరు. శ్రీహరి చివరి చిత్రం తూఫాన్.. సామాజిక బాధ్యతగా తాను చేసిన చివరి ప్రోగ్రాం తమసోమా జ్యోతిర్గమయా…

శ్రీహరి రియల్ హీరో..   శ్రీహరి తన బిడ్డ చనిపోయాక అక్షర ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి శామీర్ పేట మండలంలోని నారాయణపూర్, లక్ష్మిపూర్, అనంతారంతో పాటు మరో రెండు గ్రామాలను దత్తత తీసుకుని  డెవలప్ చేసిండు. స్కూళ్లు, రోడ్లు, తాగునీటి వసతిని కల్పించిండు.

శ్రీహరి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నా..

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.