శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా బీసీ సంఘాలు, విద్యార్థుల ఆందోళన

సకలజనభేరీ సభలో తమను మాట్లాడించలేదని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కు గత రాత్రి కొందరు ఫోన్ చేసి ఇష్టమున్నట్టు తిట్టడంపై  విద్యార్థులు,  బీసీ సంఘాలు మండిపడ్డయి.  ఓయూలో విద్యార్థులు కొందరి దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపిన్రు. శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా ఓయూ, టీయూ, పీయూ, కేయూలో విద్యార్థులు ర్యాలీలు తీసిన్రు. వరంగల్, నిజామాబాద్. మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో  బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన్రు.  కొందరు  సీమాంధ్రులకు అమ్ముడుపోయి ఉద్యమనాయకత్వాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నరని వారు  మండిపడ్డరు. రేయింబవళ్లు తిండితిప్పలు మాని తెలంగాణ కోసం పోరాడుతున్న టీజీవో అధ్యక్షుడిని  చెప్పరాని బూతులు తిట్టడమేకాకుండా  ఆయనపై తప్పుడు కేసు పెట్టడాన్ని బీసీ సంఘాలు ఖండించినయి.

తీవ్రఎండ వలన అప్పటికే సభ ఆలస్యమైందని జిల్లాల నుంచి వచ్చినవారు నీళ్లులేక, తిండిలేక అవస్థలు పడుతుంటే సభను తొందరగా ముగిస్తున్నట్టు జేఏసీ చెప్పిందని.. చాలామందిని మాట్లాడనించనందకు జేఏసీ చైర్మన్ క్షమాపణ కూడా కోరారని వారు గుర్తు చేసిన్రు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.