శైలజానాథ్ ఉదంతంపై ఎవరేమన్నారో చూడండి

కోబ్రా పోస్ట్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్ శైలజానాథ్‌పై మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ జాయింట్ కన్వీనర్ టీ శ్రీరంగారావు డిమాండ్ చేశారు. ఆర్థిక నేరాలను హత్యా నేరాల కంటే తీవ్రంగా పరిగణించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిందని, ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని తీవ్రంగా శిక్షించాలని కోరారు. కోబ్రా పోస్ట్ రహస్య ఆపరేషన్‌లో దొరికిపోయిన మంత్రి శైలజానాథ్‌ను ప్రాథమికంగా మంత్రి పదవి నుంచి బర్త్ఫ్ చేసి, ఆయనపై సమగ్ర విచారణకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమవారం ‘టీ న్యూస్’ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. ‘‘ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి వంద శాతం శిక్ష పడే అవకాశం ఉంది. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే, ఆర్థిక నేరాలకు పాల్పడితే సాక్ష్యాలు కచ్చితంగా ఉంటాయి. ఈ కేసులు రుజువైతే సదరు వ్యక్తులకు కఠిన శిక్ష విధించడంతోపాటు వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తారు. అలాంటి వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకునే ఆస్కారమే లేదు’’ అని శ్రీరంగారావు వివరించారు. ‘‘తాజా కేసులో నేరం జరగకపోయి ఉండొచ్చు. కానీ, నేరం జరగడానికి మాత్రం పోత్సాహం ఉన్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో తేలింది. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కేసులో ఆయన రూ.లక్ష లంచం తీసుకున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ చేసి, చార్జిషీటు నమోదు చేసింది. దీని ప్రకారం ఆయనకు శిక్ష పడింది. ఇదేవిధంగా మంత్రి శైలజానాథ్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.

అయితే, నేరానికి పాల్పడిన వారిని శిక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే వారిని కాపాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న మంత్రుల సంగతిని ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు. ‘‘నేరానికి పాల్పడిన వారిని శిక్షించాల్సిందిపోయి, ప్రభుత్వమే వారిని కాపాడుతోంది. ఇలాంటి సందర్భంలో మంత్రి శైలజానాథ్‌ను పదవి నుంచి తొలగిస్తారని, చట్టవూపకారం ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకుంటుదని మనం ఆశించలేం. అయితే, హైకోర్టో లేక మరే సంస్థో రేపు కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌ను సుమోటోగా తీసుకుని, ఆదేశాలు ఇస్తే తప్ప ఆయనపై కేసు నమోదయ్యే అవకాశాలు లేవు. లేకుంటే ఆయనపై కేసు నమోదయ్యేలా తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ తరఫున అన్ని చర్యలు తీసుకుంటాం’’ అని శ్రీరంగారావు తెలిపారు. తాజా మనీల్యాండరింగ్ వ్యవహారంలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డ బ్యాంకులపైనా ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అందరినీ శిక్షించాలి: వీ ప్రకాశ్
కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించి, మంత్రి శైలజానాథ్‌ను తక్షణమే కేబినెట్ నుంచి బర్త్ఫ్ చేయాలని, ఆయనను జైలుకు పంపించాలని తెలంగాణ విశ్లేషకులు వీ ప్రకాశ్ డిమాండ్ చేశారు. శైలజానాథ్‌తోపాటు ఆయన వెనుకున్న వారందరినీ అరెస్టు చేయాలన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే శైలజానాథ్ తెలంగాణకు అడ్డం తగులుతున్నారని మండిపడ్డారు.

నాకు తెలియదు
మంత్రి శైలజానాథ్ మనీల్యాండరింగ్ వ్యవహారం నాకు తెలియదు. ఈ వ్యవహారం గురించి మీకు తెలిసింది చెప్పండి (అంటూ మీడియాకు ఎదురు ప్రశ్నవేసి జారుకున్నారు). – బొత్స సత్యనారాయణ, పీసీసీ చీఫ్

సమైక్యవాద నేతలు అవినీతిపరులు
సమైక్యవాదం వినిపిస్తున్న సో కాల్డ్ కాంగ్రెస్ నేతలు లుచ్చాలు, లఫంగాలు, దొంగలు, మోసగాళ్లే. తమ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి వీరు మొదటి నుంచి సమైక్యవాదం వినిపిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. రాయపాటి సాంబశివరావు పొగాకు బదులు రాళ్ళు పంపించి సొమ్ము చేసుకుంటే, కావూరి సాంబశివరావు ఒకే డాక్యుమెంట్‌ను పలు బ్యాంకు ల్లో పెట్టి మోసాలకు పాల్పడ్డారు. ఇక లగడపాటి రాజ్‌గోపాల్ రాజస్థాన్‌లో అక్కడి ప్రభుత్వానికి రూ. 11 వేల కోట్లకు టోకరా పెట్టారు. టీజీ వెంక బ్యాంకులను ముంచారు. ఇప్పుడు మరో సీమాంధ్ర నేత శైలజానాథ్ అక్రమ ఉదంతం వెలుగు చూసింది. సీమాంవూధకు చెందిన ఆరుగురు ఎంపీలు కలిసి హైదరాబాద్ చుట్టుపక్కల మూడు మిలియన్ల డాలర్ల విలువ చేసే ఆస్తులను దోచుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంవూదరావు కుమారుడికి కూడా పలు కంపెనీలతో లావాదేవిలు ఉన్నట్లు పేరు బయటికి వచ్చింది. మధుయాష్కి, కాంగ్రెస్ ఎంపీ

తెలుసుకుని స్పందిస్తాం
మంత్రి శైలజానాథ్ మనీలాండరీంగ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల ఉదంతం గురించి మాకు తెలియదు. ఈ ఉదంతంపై సమాచారం తెలుసుకుని ఆ తర్వాతే స్పందిస్తాం. పొన్నం ప్రభాకర్, జీ వివేక్, టీ కాంగ్రెస్ ఎంపీలు

విచారణను శైలజానాథే కోరాలి
మనీ లాండరింగ్ విషయంలో రాష్ట్ర మంత్రి శైలజనాథ్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు ఆయననే కోరాలి. విచారణలో నిజాలు తేటతెల్లమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన వివాదస్పద జీవోలపై మం త్రులు సంతకాలు చేసినప్పుడు.. తమకు సంబంధం లేదనడం సరికాదు. యాదవడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ

అన్ని విషయాలు తెలుసుకున్నాక స్పందిస్తా
మా జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్‌పై వచ్చిన ఆరోపణలను మీడియాలోనే చూశాను. పూర్తి విషయాలు తెలుసుకున్నాక స్పందిస్తాను. ఒకవేళ మీడియాకు పూర్తి సమాచారం తెలిసుండి చెబితే వింటాను. జేసీ దివాకర్‌డ్డి, మాజీ మంత్రి

సంబంధంలేదన్నాడు కదా?
కోబ్రా పోస్టు బయటపెట్టిన అంశంతో ఎలాంటి సంబంధంలేదని మంత్రి శైలజనాథే పేర్కొన్నారు కదా? గండ్ర వెంకటరమణాడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

ఫోన్ చేశానంటే.. ఒప్పుకున్నట్టే
మనీలాండరింగ్ ఆరోపణలపై మంత్రి శైలజానాథ్ స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఆరోపణలు వచ్చినప్పుడు వివరాలు స్పష్టంగా చెప్పాలి. తాను ఫోన్ మాత్రమే చేశానని మంత్రి చెప్పారు. దీన్ని బట్టి మనీలాండరింగ్ ఆరోపణల్లో వాస్తవం ఉన్నదని మంత్రి ఒప్పుకున్నట్టే. సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ నేత

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.