శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగం పెంచింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల పద్దెనిమిదవ తేదీన జీవోఎం సమావేశానికి హాజరుకావాలని సీఎంకు ఆహ్వానం పంపామని ఆయన తెలిపారు. కిరణ్‌తో చర్చించాక కేబినెట్ నోట్‌పై దృష్టిపెడతామని అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ కారణంగానే సీఎం కిరణ్ సమావేశానికి రాలేకపోయారని పేర్కొన్నారు. పద్దెనిమిదన మాత్రం హాజరవుతారని చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.