శీతాకాలసమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: జైపాల్‌

వచ్చే శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ బిల్లును కేబినెట్ ఆమోదించడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కళ సాకారం కోబోతున్నందుకు తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. విభజన కారణంగా నదీ జలాలు, విద్యుత్, గ్యాస్ తదితర అంశాలపై కేంద్ర కేబినెట్ చూసుకుంటుందని తెలిపారు. సీమాంధ్ర మంత్రులు తెలంగాణ నోట్‌ను వ్యతిరేకించారని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. విభజన వలన సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని హామీ ఇచ్చారు. విభజనకు సీమాంధ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ను విడదీయడం సాధ్యంకాదు: జైపాల్
హైదరాబాద్ తెలంగాణ మధ్యలో ఉందని, కాబట్టి నగరాన్ని తెలంగాణ నుంచి విడదీయడం సాధ్యంకాదని జైపాల్ కేబినెట్ కమిటీ చర్చలో పేర్కొన్నారు. ఆయన సుమారు నలబై నిమిషాలపాటు మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు గురించి ఆయన కూలంకశంగా వివరించారు.

This entry was posted in TELANGANA NEWS.

One Response to శీతాకాలసమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: జైపాల్‌

  1. mandhubabau says:

    Jai telangana…. mee andari porataala palithame e telangana.. mee kandhariki hatss off.
    jai telanganaaa…