శివ పార్వతులే మాకు మూలం : జమైత్ ఉలేమా ముఫ్తీ

Latest News

అయోధ్య: ముస్లింలందరికి శివుడే మూలం, శివపార్వతులే మాకు సృష్టికర్తలు అంటున్నాడు ఓ మత పెద్ద. ఈ మాటలు అన్నది ఏ హిందుత్వ సంస్థ నాయకుడో లేకపోతే ఏ హిందూ మత గురువో అనుకుంటున్నారా! వారే ఈ వ్యాఖ్యలు చేసుంటే దీనిలో విశేషము ఏముంది. ఈ మాటలు అన్నది ఓ ముస్లీం మత పెద్ద. జమైత్ ఉలేమా ఇ హింద్ అనే అతి పెద్ద ముస్లిం సంస్థకు చెందిన ముఫ్తీ మొహమ్మద్ అనే మేథావి.

శివుడే ముస్లింల మొదటి ప్రవక్త అని జమైత్ ఉలేమా ముఫ్తి ముహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ముస్లీంలందరూ సనాతన ధర్మాన్ని అనుసరించారని కూడా చెప్పారు. శివపార్వతులే మా సృష్టికర్తలనడం చర్చనీయాంశమైంది. భారత్‌ను ఓ హిందూ దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకించమని కూడా చెప్పారు.

చైనీయులున్న దేశాన్ని చైనా, జపనీయులు ఉన్న దేశాన్ని జపాన్ అని పిలిచినపుడు భారత్‌ను హిందుస్తానీగా పిలిస్తే తప్పేంటన్నారు. ఫిబ్రవరి 27 న ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్ లో జరగనున్న మత సామరస్య సదస్సుకు సాధువులను ఆహ్వానించడానికి జమైత్ ఉలేమా బృందం అయోధ్య వచ్చింది.

జమైత్ ఉలేమా ఇ హింద్ అనేది భారత్‌లోని పెద్ద పెద్ద ముస్లీం సంస్థల్లో ఒకటి. ఇది 1919లో ఏర్పడింది. మొదటి నుంచి హిందూ-ముస్లిం సామరస్యంను ప్రబోధిస్తూ వచ్చింది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.