శాసించి..సాధిద్దాం

hrish1– రాజకీయశక్తిగా ఎదిగి తెలంగాణ తెచ్చుకుందాం
– సీమాంధ్ర పార్టీలను నమ్మి మోసపోయాం..
ఈ సారి ఒంటరి పోరాటమే
-వచ్చే ఎన్నికలే చివరి అవకాశం..
శ్రేణులు శ్రమించాలి: హరీశ్‌రావు
‘ఇప్పటివరకు తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశాం. నేటి సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను దక్కించుకుని..రాజకీయశక్తిగా ఎదిగి శాసిం చి మన తెలంగాణను మనమే సాధించుకుందాం’అని టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు సూచించారు. టీఆర్‌ఎస్ రాజకీయ శిక్షణ తరగతుల్లో భాగంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని పాత వ్యవసాయ మార్కెట్‌యార్డులో బుధవారం నియోజకవర్గస్థాయి శిబిరం నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ విలీ న సమయంలో 1956లో ఈ ప్రాంత ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా సీమాంవూధలో కలిపారని, తర్వాత 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో ఆనాడు పోలీసుల తూటాలకు 350మంది యువకులు బలయ్యారని గుర్తుచేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఎకైక లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ 12 ఏళ్లుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేయని ఉద్యమం లేదన్నారు. ఈ క్రమంలో మద్దతు తెలిపిన ప్రతి సీమాంధ్ర పార్టీతో పొత్తులు పెట్టుకొని మోసపోయామన్నారు.

సీమాంవూధలో టీఆర్‌ఎస్ పోటీ చేస్తే ఒక్క ఓటైనా పడుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణకు మోసం చేసే సీమాం ధ్ర పార్టీలకు మనం ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఇక పొత్తులు వద్దని, టీఆర్‌ఎస్ 16ఎంపీ, 100కుపైగా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని రాజకీయశక్తిగా ఎదిగి తెలంగాణ సాధించుకుందామన్నారు. వచ్చే ఎన్నికలే చివరి అవకాశమని..లేకుంటే సీమాంవూధుల చేతిలో ఎప్పటికీ గులాంగిరి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
తెలంగాణ వస్తే విద్యార్థులకు భవిష్యత్: కేవీ రమణాచారి
రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.లక్ష కోట్లతో తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని మాజీ ఐఏఎస్ అధికారి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడు రమణాచారి పేర్కొన్నారు. కేసీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలుచేసి, విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తామన్నారు.

టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గుంటకండ్ల జగదీష్‌డ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ బలపడుతున్న ప్రతి చోటా సీమాంధ్ర పార్టీలు కుట్ర చేసి ఉద్యమాన్ని, పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని గులాబీ జెండాను గడపగడపకు తీసుకుపోతామన్నారు. కార్యకర్తలను ఇబ్బందుకుల గురిచేస్తే అండగా ఉంటామని…కాలుకు ముల్లు గుచ్చుకుం పంటితో తీసి కాపాడుకుంటామన్నారు.

డాక్టర్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్య తీరాలన్నా, నిమ్స్ పూర్తి కావాలన్నా, ఎస్‌ఎల్‌బీసీ నీరు కాలవల్లో పారాలన్నా ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ బృందం ఆటాపాటతో అలరించింది. కార్యక్షికమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి, టీఆర్‌ఎస్వీ సెక్రటరీ జనరల్ గాదరికిషోర్, అలుగుబెల్లి అమరేందర్‌డ్డి, కాకి దయాకర్‌డ్డి, నర్సింహాడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కృపాకర్‌డ్డి, ఇంద్రసేనారావు, శ్రీనివాస్, శోభన్ బాబు, నాగిడ్డి, వెంక పాల్గొన్నారు. కాగా, హరీశ్‌రావు ప్రసంగం ప్రారంభ సమయంలో సూర్యాపేట 26వ వార్డుకు చెందిన కందుల రమేశ్ మరో 10 మంది యువకులతో వచ్చి ఘర్షణకు దిగాడు. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గుంటకండ్ల జగదీశ్‌డ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వేదికవైపు రావడంతో కార్యకర్తలు దాడి చేయగా రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ‘మొదటి నుంచి టీఆర్‌ఎస్ కోసం పనిచేస్తున్నా. కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. హరీశ్‌రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే దాడికి పాల్పడడం దారుణం’అని రమేశ్ వాపోయాడు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.