శాపాలెన్ని పెట్టినా టీఆర్‌ఎస్‌దే ప్రభుత్వం : కేసీఆర్

హైదరాబాద్ : కొత్త రాష్ట్రం.. కొత్త నాయకత్వం.. కొత్త పంథాతో ముందుకు పోదామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఎవరెన్ని శాపాలు పెట్టినా నూరు శాతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారాం నాయక్, బాబూమోహన్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లో… తెలంగాణ తలరాత మారాలంటే పాత ప్రభుత్వాల వల్ల కాదు. తెలంగాణ సార్థకం కావాలెంటే కొత్త ప్రభుత్వం రావాలె. మంచి జరగాలంటే మంచి ప్రభుత్వం రావాలి. అంటే రాజకీయ అవినీతి అంతం కావాలి.

babu Mohan Joined in Trsబాబుమోహన్, ఆకుల రాజేందర్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో మాట్లాడుతున్న కేసీఆర్

కాంగ్రెస్, టీడీపీ ఆకాశం నుంచి ఊడిపడలేదు. తెలంగాణలో సకల కష్టాలకు ఈ రెండు పార్టీలే కారణం. ఈ పార్టీలు ప్రజలను గోల్‌మాల్ చేసుడుతప్ప అభివృద్ధి చేయలేదు. డబ్బులకు, తాయిలాలకు ప్రజలు మోసపోవద్దు. లక్షల కోట్లు దోచుకున్నోడు దోపిడీయే చేస్తడు తప్ప అభివృద్ధి చేయడు, 60 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి కాంగ్రెస్, టీడీపీలు ఇప్పడు చేస్తమంటే నమ్ముదామా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.