శంకర్రావుకు కోదండరాం పరామర్శ

హైదరాబాద్: మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పరామర్శించారు. ఇవాళ ఆయన కేర్ ఆస్పత్రికి వెళ్లి శంకర్రావుతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడంలేదనే శంకర్రావుపై కోపంతో అరెస్టు చేశారని కోదండరాం ఆరోపించారు. మాజీ మంత్రిపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శంకర్రావుకు నారాయణ పరామర్శ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా ఇవాళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

సీబీఐతో విచారణ జరిపించాలి: సుస్మిత
తన తండ్రిపై పోలీసులు అనుసరించిన వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన సీఐడీ విచారణపై తమకు నమ్మకంలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని శంకర్రావు కుమార్తె సుస్మిత డిమాండ్ చేశారు. తన తండ్రిపై పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని ఆమో ఆరోపించారు. కాగా, ప్రస్తుతం శంకర్రావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సుస్మిత స్పష్టం చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.