వైఎస్ విగ్రహానికి నిప్పు

ఖమ్మం జిల్లా పాల్వంచ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖరడ్డి విగ్రహానికి మంగళవారం రాత్రి గుర్తు తెలియ ని వ్యక్తులు నిప్పటించారు. విగ్రహం తల భాగంలో టైర్లు వేసి నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడిగా టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీకటి కార్తీక్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కార్తీక్ పోలీసులకు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అదుపులోకి తీసుకున్నారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.