వేషాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు:ఈటెల

హైదరాబాద్, డిసెంబర్ 16: తెలంగాణాను అడ్డుకునే వేషాలు మానుకొకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని సీమాంధ్ర నేతలను టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. సోమవారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. శాసనసభ ఔన్నత్యానికి విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదన్నారు. విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని చెప్పినప్పటికీ కుట్రపూరిత ఆలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతులను చింపి తెలంగాణ ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానపరిచారని తెలిపారు.

సీమాంధ్ర నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి:గంగుల
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను చించడటం, కాల్చటం వంటి దుశ్చర్యకు పాల్పడిన సీమాంధ్ర నేతలు తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్‌చేశారు. సీమాంధ్ర నేతలు సోమవారం శాసనసభ ఆవరణలో బిల్లు ప్రతులను చింపేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

సమైక్యాంధ్ర తీర్మానం ఎట్ల చేస్తరు?:గుండా మల్లేష్
గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ తీర్మానం చేయాలని పట్టుబట్టినా పట్టించుకోని వారు సమైక్యాంవూధపై తీర్మానం ఎలా చేస్తారని సీపీఐ శాసనసభా పక్షనేత గుండా మల్లేష్ ప్రశ్నించారు. ప్రాణ త్యాగాలు, ప్రజా పోరాటాల ఫలితమే ప్రస్తుత నిర్ణయమని పేర్కొన్నారు.

సీమాంధ్ర నేతల ఆటలు సాగవు:నాగం
తెలంగాణను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆటలు ఇక సాగబోవని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెడుతున్నారని తెలిసికూడా ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత హాజరుకాకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రపతి పంపిన బిల్లును గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంవూతికి లేదా? అని ప్రశ్నించారు.

సీమాంధ్ర నేతలది అనాగరిక చర్య:గండ్ర వెంకటరమణాడ్డి
సీమాంధ్ర నేతలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రతులను చింపేయడం అనాగరిక చర్యగా చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణాడ్డి అభివర్ణించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనందునే వారు ప్రతులను దహనం చేశారని విమర్శించారు. ఇది దుర్మార్గమని, ధైర్యం ఉంటే సంయమనం పాటించి చర్చకు ముందుకు రావాలన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నేరవేరిందని, ఇందుకుగానూ సహకరించిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధానమంత్రి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

శాంతి భద్రతలు గవర్నర్ చేతుల్లో ఉంటే నష్టమే: దానం
విభజన తర్వాత శాంతి భద్రతలు గవర్నర్ చేతుల్లో ఉండటం హైదరాబాద్ ప్రాంతానికి తీవ్రనష్టమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్ అభివూపాయపడ్డారు. గవర్నర్ అధికారాలతో హైదరాబాద్‌కు ఆర్ధికంగా నష్టం జరుగుతందని చెప్పారు. దీనిపై అనేకసార్లు వ్యతిరేకత కనబరిచామని, బిల్లుపై చర్చ సందర్భంగా ఇదే అభివూపాయాన్ని వ్యక్తంచేస్తామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.