వేలు విడిచిన మామ కాదు.. వేలు పట్టి నడిపించిన మార్గదర్శి-టీడీపీకి హరీష్ స్ట్రాంగ్ కౌంటర్

కేసీఆర్ కు వ్యతిరేకంగా హరీష్ రావును కార్నర్ చేస్తున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన్రు.   సీఎం కేసీఆర్ తనకు వేలు విడిచిన మేనమామ కాదని.. వేలు పట్టుకుని నడిపించిన మార్గదర్శి  అని హరీష్‌రావు అన్నరు. రేవంత్‌రెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే సహించేదే లేదన్నరు. ఈ రాజకీయాలు, ఈ పదవులు కేసీఆర్ పెట్టిన భిక్షేనని చెప్పిన్రు.

మరోమారు తనపై ఎవరు  తప్పుడు ప్రచారం చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన్రు.  రేవంత్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నరు. ఆయన తన మీద పదేపదే మాట్లాడుకోవడం మానుకోవాలని సూచించిన్రు. బాబును మెప్పించేందుకు ఇతరులపై గోబెల్స్ ప్రచారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన్రు. కేసీఆర్ జీవితం త్యాగాల పునాదుల మీద నిర్మించబడ్డదని హరీష్ కొనియాడిన్రు.

చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోట్లపై నిర్మించబడ్డదని.. పిల్లనిచ్చిన మామ చావుకు కారణమైన వ్యక్తి బాబు అని దుయ్యబట్టారు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరం చేసినవాడని విమర్శించిన్రు.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.