వెల్‌కమ్ టు వాటర్ బోర్డ్

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు మెరుగైన సేవల పేరిట ప్రైవేటు కంపెనీలకు వినియోగదారుల సంబంధాలు, నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. వీటిలో పని చేసే వారికి వేలల్లో జీతాలు చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సేవల పేరు చెప్పి రూ.కోట్లు బొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాటర్, సీవరేజీ సెస్ రూపంలో దాదాపు రూ. 55 కోట్లు, కొత్త నల్లా కనెక్షన్ల జారీకి రూ.8 కోట్లు, వాటర్ ట్యాంకర్ల నీటి సరఫరా రూపంలో రూ.కోటి కలిసి జలమండలి నెలవారీ రాబడి మొత్తం రూ.64 కోట్లు. వీటిలో సిబ్బందికి జీతా లు రూ.18 కోట్లు, విద్యుత్ ఛార్జీలు రూ.43 కో ట్లు, ఆపరేషన్స్ అండ్ మొయింటనెన్స్, అడ్మిని స్ట్రేటివ్ ఖర్చులు రూ.8 కోట్లు, బ్యాంకులకు చెల్లించే వడ్డీ తాజా వాటితో కలిసి రూ. 6 కోట్లు కలి పి మొత్తం రూ.75 కోట్ల మేర నెలకు ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెల వస్తున్న ఆదాయానికి, ఖర్చుకు తేడా గమనిస్తే రూ.11 కోట్ల మేర నష్టాల బాటలో ఉంటుంది. ఇదీ జలమండలి నెలవారీ ఆర్థిక ముఖ చిత్రం.

ఐతే ఈ పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించి సంస్థకు ఆదాయం పెంచాల్సిన తరుణంలో యాజమా న్యం వింత పోకడలను అవలంబిస్తోంది. ఖరీదైన స్టార్ హోటల్స్‌లో సమీక్షలు, వాహనాల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఐఫ్యాడ్, కంప్యూటర్లు, ఈ పాస్ మిషన్ల కొనుగోలులో దుబారాకు తెరలేపడం, ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా ఆస్తులను తనఖా పెట్టి వడ్డీల భారం పెంచుకోవడం, చివరకు సంస్థకు పేరుకుపోయి న రూ.800 కోట్ల నీటి బకాయిలను రాబట్టుకోలేక పోవడంలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలు అధికారుల పనితీరుకు అద్దం పడుతోం ది. ఇవన్నీ చాలదన్నట్లుగా ప్రతి నిర్ణయం కార్పొరేట్ స్టైల్‌లో అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న సిస్టంను మెరుగుపర్చుకోవడం, అవసరమైతే ప్రస్తుత ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఓఎస్డీ, డిప్యూ అధికారుల సంఖ్యను పెంచుకుని గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలను అందించాల్సిన అధికారులు ప్రైవేట్‌కు రెడ్‌క్పాట్ పరుస్తోంది. ‘కప్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ ఎజెన్సీ (కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ సెల్ (సీఆర్‌ఎంసీ), సేవల సేకరణ)’ పేరిట రూ. 1.4 కోట్లతో ప్రజల సేవల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రెండు సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యతలను ఎజెన్సీకి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం సేవల కంటే మెరుగైన సేవలందించేందుకు సీఆర్‌ఎం సెల్ ఏర్పాటు చేయడం మంచి ప్రయత్నమే ఐనా ఈ పేరిట జరిగే దుబారా మాత్రం అంతుచిక్కని అంశం.

సాఫ్ట్‌వేర్ జీతాలు !
కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో జాబ్ పొందిన ఉద్యోగులు అదృష్టవంతులు. ఎందుకంటారా? ఈ విభాగంలో పని చేసే వారికి నెల వారీ జీతం రూ.75 వేలు, పర్యవేక్షణదారుడికి రూ.34 వేలు. చెల్లింపుల కోసం ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1.4 కోట్లకు చే ర్చి టెండర్లు పిలిచారు. టెండర్లలో కొన్ని అంశాలను పరిశీలిస్తే…

– వినియోగదారుల ఫిర్యాదులను సంబంధిత ఏజెంట్లకు అందించేందుకు అటోమెటిక్ కాల్ డై వటర్ 24 సెట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కొక్క సెట్‌కు రూ.28 వేల చొప్పున రూ.6.72 లక్షల ఖర్చు చేయనున్నారు.

-జలమండలికి సంబంధించిన ఫిర్యాదులపై పరిశీలన, యాజమాన్యానికి నివేదికలు అందించడం, కాల్ సెంటర్‌లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షించేందుకు గానూ కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజర్‌కు రూ.75వేల జీతం చొప్పున రెండు షిఫ్ట్ ల్లో మొత్తంగా ఇద్దరు వ్యక్తులకు సంవత్సరానికి రూ.18 లక్షలు జీతాలకు ఖర్చు చేయనున్నారు.
– దీంతో పాటు మేనేజర్‌కు సహాయనికుడిగా ఒక్కొ షిఫ్ట్‌కు ఒక్కొక్కరికీ రూ.60 వేల జీతం చొ ప్పున రూ. 14.40 లక్షలు వెచ్చించనున్నారు.

– ఫిర్యాదుదారుల నుంచి ఫోన్ రీసివ్ చేసుకుని సంబంధిత ఫిర్యాదుదారులకు జవాబులు అం దించడంతో పాటు ఫీల్డ్ సాఫ్ట్‌కి సమాచారం టోకె న్ నెంబర్లు అందజేసేందుకు రెండు షిప్ట్‌లకు కలిపి 20 మంది కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ (సీనియర్) ఒక్కొక్కరికీ రూ.24 వేల చొప్పున రూ.57.60 లక్షలు.

-కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌పైన పర్యవేక్షణ కు రెండు షిఫ్ట్‌లో ఇద్దరి వ్యక్తులకు ఒక్కొక్కరికీ రూ.34వేల చొప్పున రూ.8.16 లక్షల ఖర్చు అ వుతుందని ప్రతిపాదనలు రూపొందించారు. కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో మొత్తంగా కస్టమర్ రిలేషన్‌షిఫ్ మేనేజర్‌తో పాటు అసిస్టెంట్ కస్టమర్ రిలేషన్ మేనేజర్లు ఇద్దరు, సీనియర్ కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఒక్క రూ, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్ 10 మంది పనిచేస్తారు. వీరికి సంస్థ ప్రధాన కార్యాలయంలో సకల ఏర్పాట్లు సమకూర్చుతూ కేవలం నిర్వహణ, జీతాలకు గానూ ఏజెన్సీకి రూ.1.4 కోట్లు దోచిపె సిద్ధమైంది.

అర్హతలు ఇవే.?
రూ.1.4కోట్ల కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కాంట్రాక్ట్ పొందేందుకు కొన్ని జలమండలి అధికారులు అర్హతలను ఈ విధంగా పొందుపరిచారు. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాలలో రూ.కోటి టర్నోవర్ కలిగి ఉండాలి. దాంతో పా టు సీఆర్‌ఎం ఏజెన్సీ కంపెనీ ఐదు సంవత్సరాల కాలంలో రూ.900 కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీలలో కనీసం 4 లక్షల మంది కస్టమర్లకు సేవలందించి ఉండడంతో పాటు సంబంధిత ఎజెన్సీదారుడు ఏడాదికి రూ. 50 లక్షల వర్క్ చేసి ఉండాలి. ఐతే జీవో నెం.94 ప్రకారం ఈ టెండ ర్ పిలిచినప్పటికీ షరతుల విషయంలో అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎంఆర్‌లో పరిష్కరించే ఫిర్యాదులివే..
జలమండలికి సంబంధించి పైపులైన్ లీకేజి, బోర్ రిపేర్, స్ట్రామ్ వాటర్ ఓవర్‌ఫ్లో, మ్యాన్‌హోల్ పునరుద్దరణ, డయల్ యువర్ ట్యాంకర్, నో వాటర్ సెప్లై, సీవరేజి ఓవర్‌ఫ్లో, లో ఫ్రెజర్, సెఫ్టిక్ ట్యాంక్ రిపేర్, నీటి బిల్లు రానివారు, అధి క మొత్తంలో బిల్లు వచ్చిన, నల్లాలకు మోటార్లు బిగించిన, కొత్తగా నల్లా కనెక్షన్ కావాలన్న, కలుషిత నీరు, నీటి మీటర్ తిరగక పోయిన, మీటర్ రీ ప్లేస్‌మెంట్, ఒక క్యాటగిరి నుంచి మరో క్యాటగిరి వెళ్లాలన్న, సీవరేజి సెస్ వివరాలు, వినియోగదారుడి అకౌంట్ వివరాలు, పేరు మార్పిడి, నీటి బిల్లు రాకపోయిన, పెండింగ్ బిల్లు సెటిల్‌మెంట్, ఆన్‌లైన్ దరఖాస్తులపై వివరాలు అం దించి సమస్యకు పరిష్కారం చూపనున్నారు. వీటితో పాటు కస్టమర్ కేర్ 155313 ఫిర్యాదులను, ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే డయల్ యువర్ ఎండీ, మీట్ యువర్ ఎండీ, ఈ-మొయిల్స్ ద్వారా వచ్చే ఫిర్యాదులను, పత్రికల్లో వచ్చిన కథనాలపై పర్యవేక్షణ, ప్రతి సోమవారం ప్రజావాణి, లోక్ అదాలత్, జీహెచ్‌ఎంసీ ఫేస్ టూ ఫేస్‌లో వచ్చే ఫిర్యాదులు, జలమండలి ఫేస్‌బుక్, సింగిల్‌విండోలో కొత్త కనెక్షన్లపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.