వెలిశాలలో పోలీసుల చర్య అప్రజాస్వామికం: వివి

వరంగల్ : చిట్యాల మండలం వెలిశాలలో మవోయిస్టు నేత గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ స్మారక స్థూపాన్ని పోలీసులు కూల్చివేయడం పట్ల విరసం నేత వరవరరావు మండిపడ్డారు. వెలిశాల గ్రామంలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులు తమ స్వంత భూమిలో జ్ఞాపకంగా స్మారక స్థూపాన్ని నిర్మించుకుంటే పోలీసులు తుపాకులతో ఇంటిమీద దాడి చేసి స్థూపాన్ని కూల్చడం అనాగరికమన్నారు. కూల్చిన వాళ్లే స్థూపాన్ని నిర్మించాలని వివి, అమరుల బందుమిత్రుల కమిటీ నేతలు పద్మక్క, భారతి, ఆజాద్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.