వెనిజూలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ కన్నుమూత

hugoవెనిజులా : ప్రజల మనిషి వెనిజులా అధ్యక్షుడు హ్యుగో చావెజ్(58) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కరాకస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెనిజులా మరణంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. వెనిజులా మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయనకు క్యాన్సర్‌కు సంబంధించి వైద్యులు నాలుగుసార్లు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 1999 నుంచి ఆయన వెనిజులా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడిగా 1999 ఫిబ్రవరి 2న బాధ్యతలు స్వీకరించారు. 1997లో రిపబ్లికన్ మూవ్‌మెంట్ పార్టీని స్థాపించారు. వెనిజులాకు నాలుగో సారి అధ్యక్షుడిగా 2012 అక్టోబర్ 7న ఎన్నికయ్యారు. 1954 జులై 28న ఆయన జన్మించారు. 2013 మార్చి 5న తుదిశ్వాస విడిచాడు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.