వెనక్కి తగ్గితే సమ్మె తప్పదు: టీఎన్జీవోలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీఎన్జీవోలు కేంద్రప్రభుత్వాన్ని మరోమారు హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గితే మరోమారు సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈమేరకు టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రకటించారు. ఈనెల 29 నుంచి ఆగస్టు 5 వరకు హైదరాబాద్‌లో సద్భావన ర్యాలీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను వ్యక్తిగతంగా కలిసి తెలంగాణకు అడ్డుపడ వద్దని విజ్ఞప్థి చేస్తామని ఆయన తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.