వెటర్నరీలో వేలు పెడితే హెరిటేజీకి ఎసరొచ్చింది

వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ కునారిల్లిపోయిందంటూ, పాలు కల్తీ అవుతున్నయంటూ  టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశం వాళ్ల మెడకే చుట్టుకుంది.  పాలను కల్తీ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ టీడీపీ నేతలు రెచ్చిపోయిన్రు. పాల కల్తీలకు పాల్పడుతున్నది హెరిటేజ్ సంస్థేనని హెరిటేజ్ ను గతంలో కేరళలో నిషేధించిన్రని మంత్రి కేటీఆర్ జీవోను చూపించిన్రు. దీనికి టీడీపీ సభ్యులు అడ్డుతగలడంతో కేటీఆర్ ఎదురుదాడికి దిగిన్రు.   టిటిడిపి సభ్యులు చంద్రబాబు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ నామినెట్ పర్సన్స్ లెక్క బిహేవ్ చేస్తున్నరని.. హెరిటేజ్‌ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.వాస్తవాలు వెల్లడిస్తుంటే టీడీపీ సభ్యులు ఎందుకు ఉలికిపడుతున్నారని కేటీఆర్‌ అన్నరు. హెరిటేజ్ శాంపిల్లో డిజర్జెంట్లు ఉన్నట్లు తేలిందని ఉపముఖ్యమంత్రి రాజయ్య అన్నరు. .ఇప్పటికే 11 కంపెనీలపై కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు. త్వరలో చర్యలు తీసుకుంటమని చెప్పిన్రు.

This entry was posted in ARTICLES, TELANGANA NEWS.

Comments are closed.