వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రం

తెలంగాణ విషయంలో ఏర్పాటుచేసిన జీవోఎం విధివిధానాలపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పిన తర్వాత అఖిలపక్షం ఎప్పుడు నిర్వహించేదీ నిర్ణయిస్తామని హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ముగిస్తామని అన్నారు. గురువారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కలిశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరుగడం లేదని పేర్కొంటూ సీఎం కిరణ్ ఇటీవల..రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు రాసి న విషయం తెలిసిందే. ఈ అంశంలో వివరణ కోరుతూ రాష్ట్రపతి కార్యాలయం ఆ లేఖను యథాతథంగా హోం శాఖకు పంపింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇచ్చేందుకు షిండే స్వయంగా ప్రణబ్‌ను కలుసుకున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నదని ఆయనకు స్పష్టం చేశారని తెలిసింది. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రుల బృందం విధివిధానాలపై అభివూపాయాలు కోరుతూ ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలకు లేఖలు పంపినట్లు తెలిపారు. సీఎం రాసిన లేఖలపై స్పందించేందుకు నిరాకరించారు.

ఎనిమిది పార్టీలకు హోంశాఖ లేఖలు
విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం విధి విధానాలపై అభిప్రాయాలను ఐదవ తేదీలోపు చెప్పాలని కోరుతూ రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన పార్టీలకు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ సురేష్‌కుమా ర్ లేఖలు రాశారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం పార్టీలకు ఈ లేఖలు వెళ్లాయి. 7న మంత్రుల బృందం తదుపరి సమావేశం జరుగనుంది. ఈలోపే అఖిలపక్షం నిర్వహించి.. దాని అభిప్రాయాలను జీవోఎంకు నివేదించాలని కేం ద్రం భావిస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.