వీరునికి చావులేదు-ఉదయమిత్ర

అనుకుంటాంగాని హత్యలు జేసి
ఆశయాల్ని చిదిమేయగలరా…
తలి ్లగర్భం నుండివిడివడిన వాడు
పుడమి గర్భంలో సమసిపోవోచ్చునేమొగానీ
ఉరికంబంమీద జన్మించివోడికి
ఉజ్వల పోరాటగానం జేసినోడికి చావెక్కడ?
ఉరిదీసినా కొద్దీ
‘బషాయిటుడు’ లా పుట్టుకొస్తుంటాడు
వీరునికి చావులేదు
శరీరాన్ని చిదిమేస్తే చరిత్ర ఆగిపోదు…
అతడు నడిచిన తొవ్వ ఉంటది
జగిత్యాల జైత్ర యాత నుండి
జంగల్ మహల్ దాంక
జల్- జంగల్- జమీన్ కోసం
సాగించిన మహావూపస్థానముంటది..
సంఘర్షణదారుల్లో
చరిత్ర సత్యాన్ని తేల్చిచెప్పినమాట.
చీకటి దారుల్లో
వెన్నెల కాంతుల్ని విరజిమ్ముతుంటది
అతడెత్తిన పిడికిలుంటది
యుద్ధగానాన్ని ఆపొద్దని పిలుపునిస్తది
వీరునికెప్పుడూ చావులేదు
తన చితాభస్మంతో..పొలాల్ని పచ్చగ ఉంచుతాడు
అతడు ప్రజల నాలుకలమీద నర్తించే పాట
పోరులో నినదించే మాహోగ్ర యుద్ధకేక
వాళ్లు మురిసి పోతున్నారేమో..
పోరుదప్ప దారిలేనివాళ్లు
నిశిరాత్రి భయానక చలిలో
యుద్ధగాధల్ని నెమరేస్తుంటారు
ఎగిసిపడుతున్న మంటలు
వాళ ్లకళ్లల్లో ప్రతిఫలిస్తుంటాయి
అవి మెల్లమెల్లగా మాయమయి
పిడికిపూత్తిన వీరుని రూపమే మిగిలిపోతది
భుజం మీద తుపాకీ వెచ్చగ తగుల్తది
-ఉదయమిత్ర

This entry was posted in POEMS.

One Response to వీరునికి చావులేదు-ఉదయమిత్ర

  1. kranti says:

    anthima vijayam prajalade