వీరజవాన్‌కు కన్నీటి వీడ్కోలు -మిన్నంటిన యాదయ్య అమర్హ్రే నినాదాలు


కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగిన వీర జవాన్ మల్లెపాకుల యాదయ్యకు ప్రజలు కన్నీటి వీడ్కో లు పలికారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండాడ్డిపల్లికి జవాన్ యాదయ్య మృతదేహం గురువారం మధ్యాహ్నం గ్రామానికి చేరుకుంది. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విమానంలో వచ్చిన మృతదేహాన్ని అం బుపూన్స్‌లో సైనికాధికారులు తీసుకొచ్చారు. గ్రామ శివార్లలోనే అంబుపూన్స్‌కు ఎదుళ్లిన ప్రజలు యాదయ్య అమర్హ్రే అంటూ నినాదాలు చేశారు.

కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాలకు చెంది న ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. యాద య్య మృతదేహానికి మంత్రి డీకే అరుణ, ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌డ్డి, యెన్నం శ్రీనివాస్‌డ్డి, జైపాల్‌యాదవ్, రాములు, రేవంత్‌డ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, కలెక్టర్ గిరిజాశంకర్, ఎస్పీ నాగేంవూదకుమార్ నివాళుర్పించారు.

బాధిత కుటుంబాన్ని ఓదార్చా రు. జాగృతి అధ్యక్షురాలు కవిత రూ. 50 వేలు, ఎమ్మెల్యే రేవంత్‌డ్డి రూ.50వేలు యాదయ్య భార్యకు అందజేశారు. ప్రభు త్వం తరుపున కలెక్టర్ రూ.1లక్ష, సైనికాధికారులు సంక్షేమ నిధి నుంచి రూ.10 వేలు అందించారు. అధికార లాంఛనాలతో యాద య్య సొంత భూమిలో అంత్యక్షికియలు నిర్వహించారు. సైనికాధికారులు లాంఛనాలను పూర్తి చేసి జాతీయ జెండాను యాదయ్య భార్యకు గౌరవంగా అందజేశారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. మృతదేహాన్ని వారి సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.