విశాలాంధ్ర వద్దన్న హైదరాబాద్ అసెంబ్లీ

Assembly-building 1953 ఏప్రిల్ 11.. తెలంగాణ చరిత్రలో చెరిగిపోని రోజు
సరిగ్గా 60 సంవత్సరాల క్రితం.. 1953లో ఇదే రోజు (ఏప్రిల్ 11వ తేదీ) హైదరాబాద్ శాసనసభ ఒక చారిత్రక ఘట్టానికి వేదికైంది. విశాలాంధ్ర ఏర్పాటు మాకొద్దంటూ మెజారిటీ ఓట్లతో తీర్మానం ఆమోదించింది. తక్షణమే విశాలాంధ్ర కావాలన్న తీర్మానాన్ని ఓడించి తెలంగాణ ఆత్మగౌరవ పతాకను సగర్వంగా ఎగరేసింది.

…‘‘హైదరాబాద్ శాసనసభలో మూడింట రెండొంతుల మంది శాసనసభ్యులు విశాలాంధ్రకు మద్దతు తెలిపారు. 175 మంది ఎమ్మెల్యేలలో 103 మంది విశాలాంధ్ర ఏర్పాటు చేయాలన్నారు…’…
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి చలసాని శ్రీనివాస్, పరకాల నుంచి లగడపాటి దాకా ఆంధ్ర నాయకులు, మేధావులు చెవికోసిన మేకలా జరుపుతున్న ప్రచారం ఇది. విశాలాంవూధకు మద్దతుగా హైదరాబాద్ శాసనసభ తీర్మానమే చేసేసిందని కూడా ప్రచారాలు చేసిన సందర్భాలున్నాయి. ఆంధ్ర, తెలంగాణ విలీనం బలవంతంగా జరిగింది కాదని, తెలంగాణ వారే విలీనం కోసం తహతహలాడారని వాదిస్తున్నవారూ ఉన్నారు. వాళ్లు చెప్పిన మాటనే అక్షరసత్యంగా నివేదికల్లో రాసేసుకున్న జస్టిస్‌లు ఉన్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. 1953లోనే హైదరాబాద్ శాసనసభ విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. ఆనాడు తెలంగాణ, ఆంధ్రవూపాంతాలను కలపాలంటూ శాసనసభలో ప్రతిపాదించిన తీర్మానాన్ని మెజారిటీ ఓట్లతో నిష్కర్షగా తిరస్కరించింది. మాకు విశాలాంధ్ర అవసరం లేదంటూ తిప్పికొట్టింది. ‘లోటు బడ్జెట్‌తో దుకాణం తెరిచే ఆంధ్రతో కలిస్తే మాకేమొస్తుంది? బూడిదా?’ అంటూ నిలదీసింది. ‘వందల ఏళ్ల బానిసత్వం నుంచి బయటపడ్డాం. మళ్లీ బానిసత్వంలోకి వెళ్లాలా? అని ప్రశ్నించింది. ఏడాది క్రితమే గైర్ ముల్కీ గొడవ చూశాం కదా.. అని నిలదీసింది.
అనాడు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సాక్షిగా జరిగిన ఈ సంఘటన తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పింది.
చరివూతలో నిలిచిపోదగిన ఈ ఘటన దురదృష్టవశాత్తూ ప్రచారానికి నోచుకోక చీకటి పొరల్లో ఒదిగిపోయింది. తెలంగాణకు సంబంధించి అనేక అంశాలను విస్మరించినట్టే ఈ అంశాన్ని సైతం బుద్ధిపూర్వకంగానే బుద్ధిజీవులంతా విస్మరించారు.

నేపథ్యం
1952 చివర్లో పొట్టి శ్రీరాములు మరణం అనంతరం కేంద్రం నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. తొలుత మద్రాసు కావాల్సిందేనని పట్టుబట్టినా తరువాత అది లేకుండానే రాష్ట్రం తీసుకోవడానికి ఆంధ్రులు సిద్ధమయ్యారు. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు లెక్కలు కట్టి, ఆంధ్ర రాష్ట్రం రూ.4 కోట్ల లోటు బడ్జెట్‌తో ప్రారంభమవుతుందని ప్రకటించారు. అయినా 1953 అక్టోబర్ ఒకటో తేదీన కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించగానే రాజధాని విషయమై ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య సిగపట్లు ప్రారంభమయ్యాయి.

మరోవైపు మూడు రాష్ట్రాల్లో విడివిడిగా ఉన్న మరాఠాలకు సంయుక్త మహారాష్ట్ర ఏర్పాటు చేయాలని ఒకవైపు, కన్నడ ప్రాంతాలను మైసూరులో చేర్చి రాష్ట్రం ఏర్పాటు చేయాలని మరోవైపు ఆందోళనలు జరుగుతున్నాయి. భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నందున తమ రాష్ట్రం కూడా దానితోపాటే ఏర్పాటు చేయాలనేది వారి డిమాండ్.
ఇక హైదరాబాద్ అప్పటికే ఒక రాష్ట్రంగా ఏర్పడి, 1951 ఎన్నికలతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంవూతిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి అభివృద్ధి పథకాలతో దూసుకుపోతున్నది. తమ పార్టీ మీద నిషేధం ఉండడంతో 1951లో పీడీఎఫ్ పేరిట ఇతర పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేసి తెలంగాణలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన కమ్యూనిస్టులు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. 1952లో విశాలాంధ్ర ఏర్పాటు తమ విధానంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఇదిలా ఉంటే 1953నాటికి పార్టీ కేంద్ర స్థానమైన ఆంధ్రలో రాష్ట్ర ఏర్పాటు ఖాయమైనా రాజధానిగా వారు కోరిన విజయవాడ దక్కే అవకాశం మృగ్యమైంది.

ఈ సమయంలోనే ‘హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర’ నినాదం ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలో 1953 ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్ శాసనసభలో చిన్నకోడూరు పీడీఎఫ్ ఎమ్మెల్యే కే వెంకటరామారావు తెలంగాణను ప్రతిపాదిత ఆంధ్రరాష్ట్రంతో కలిపి తెలుగు భాషా రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఒక అనధికార తీర్మానాన్ని ప్రతిపాదించారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఆయా భాషా ప్రాంతాలను సమీప భాషా ప్రాంతాలతో కలిపి రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్రపతిని కోరాలంటూ ఆయన ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయానికి బౌండరీ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఆయన తీర్మానంలో పేర్కొన్నారు. ఆరు అంశాలతో ఈ తీర్మానం ప్రతిపాదించినా లక్ష్యం మాత్రం విశాలాంధ్ర ఏర్పాటే. రెండు రోజులపాటు కొనసాగిన చర్చలో సింహభాగం చర్చించింది విశాలాంవూధపైనే.
స్వాతంత్య్రం రాక మునుపే భాషా రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఆ విధానానికి అనుగుణంగా వెంటనే భాషా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని, ఒకే రాష్ట్రంలో భిన్న భాషా సంస్కృతులవారు ఉండడంవల్ల పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయనే ధోరణిలోనే విశాలాంధ్ర వాదుల ప్రసంగాలు సాగగా తెలంగాణవాదులు తమ ప్రసంగాల్లో విశాలాంధ్ర వాదనను చీల్చి చండాడారు. రాజధానికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు షాజహాన్ బేగం మాట్లాడుతూ భాషా రాష్ట్రాలే ఏర్పాటు చేయాల్సి వస్తే ఉర్దూ మాట్లాడే వాళ్లూ రాష్ట్రం కోరితే ఏం చేస్తారని నిలదీయడంతో నీళ్లు నమలడం విశాలాంవూధవాదుల వంతైంది.
బోధన్ ఎమ్మెల్యే శాస్త్రి తన ప్రసంగంలో విశాలాంవూధవాదులను తూర్పారబట్టారు. ఆంధ్ర ప్రాంతం వాళ్లు వాంఛూ వివేదిక (మవూదాసు పట్టణం ఆంధ్రులకు చెందదని.. కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునే వరకు తాత్కాలిక రాజధానిగా మాత్రమే కొనసాగాలని) రాగానే విశాలాంధ్ర… హైదరాబాద్ రాజధాని అని అంటున్నారని దుయ్యబట్టారు.
ఆంధ్రతో కలవాలంటే రాయలసీమ వాళ్లే ఒప్
పుకోక అనేక షరతులతో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారని గుర్తుచేశారు. మనం వాళ్లకన్నా ముందున్నామా అని నిలదీశారు. వందల ఏళ్లుగా బానిసత్వంలో ఉన్నాము.. ఇంకా ఉండాలా అని ప్రశ్నించారు.
1952లో జరిగిన ముల్కీ ఉద్యమం గురించి, ఆంధ్ర అధికారులు ఉద్యోగాలు కొల్లగొట్టిన అంశాన్ని గురించి ప్రస్తావించారు. అపుడు గైర్ ముల్కీలు వెళ్లాలని కోరి, ఇపుడు విశాలాంధ్ర అని ఎలా అంటామని అడిగారు. ఆంధ్రవాళ్లు వస్తే వాళ్లు పెత్తనం చేస్తారనే భయం ఉందని వెల్లడించారు. అందరిలోనూ ఆ భావన ఉన్నా కొందరు బయటపడడం లేదన్నారు.

ఇక ప్రాంరంభంలోనే నాలుగు కోట్ల లోటు ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఏం బావుకుంటామని పీడీఎఫ్ సభ్యులను ప్రశ్నించారు. కలిస్తే డబ్బున్న వాడితో కలవాలిగాని డబ్బులేని వాళ్ళు కలిస్తే జోగిజోగి కలిస్తే బూడిదే మిగులుతుందని ఎద్దేవా చేశారు.

చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చరివూతాత్మక ప్రసంగం చేశారు. అప్పటి వరకూ భాషారాష్ట్రాల అంశంపై కాంగ్రెస్ చేసిన తీర్మానానికి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. దేశ సమైక్యతకు భాషారాష్ట్రాల ఏర్పాటు భంగకరమని కుండ బద్దలు కొట్టారు. గతంలో ఎలా ఉన్నా, ప్రస్తుతం ప్రాంతీయ భాషల వికాసానికి సంపూర్ణ అవకాశం ఉందని, ఆంధ్ర సాహిత్య పరిషత్తు, కన్నడ మరాఠా సాహిత్య సంస్థలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నందున భాషా విచక్షణ అనే ప్రశ్నే తలెత్తదని తేల్చిచెప్పారు.

హైదరాబాద్ సంస్థానానికి స్వయం నిర్ణయాధికారం…
కాంగ్రెస్ భాషారాష్ట్రాల ఏర్పాటుపై తీర్మానం చేసింది వాస్తవమే అయినా హైదరాబాద్ సంస్థానానికి భాషా ప్రాంతాల విషయంలో 1947లోనే స్వయం నిర్ణయాధికారం ఇచ్చిందని వెల్లడించారు. (అప్పట్లో దేశంలో ఆయా ప్రాంతాల్లో భాషా ప్రాతిపదికన కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు చేసింది. మద్రాసు ప్రెసిడెన్సీలో మద్రాసు కమిటీకి తోడు ఆంధ్రకు ప్రత్యేకంగా కమిటీ వేసింది. అయితే హైదరాబాద్ సంస్థానంలో మూడు ప్రాంతాలున్నందున ఏ రకంగా కమిటీ వేయాలనే విషయంలో నిర్ణయాధికారం సంస్థాన కాంగ్రెస్‌కే వదిలివేసింది.) ఆ రకంగా కాంగ్రెస్ తీర్మానం దేశానికంతా వర్తించినా హైదరాబాద్‌కు వర్తించబోదని స్పష్టం చేశారు. మరోవైపు నిజామాబాద్ కాంగ్రెస్ సభలో విశాలాంధ్ర తీర్మానం ప్రస్తావిస్తూ అది ఏకపక్షం కాదని… ‘హైదరాబాద్ విభజనే జరిగితే అది షరతులకు లోబడే జరగాలి’ అని తీర్మానించామని గుర్తు చేశారు.
సుదీర్ఘ చర్చ అనంతరం తీర్మానాన్ని డివిజన్ పద్ధతిలో ఓటింగుకు పెట్టి, సమర్థించిన, వ్యతిరేకించిన వారి పేర్లను కూడా నమోదు చేశారు. విశాలాంధ్ర ఏర్పాటుకు 63 మంది అనుకూలంగా ఓటు వేయగా, వ్యతిరేకంగా 79 మంది ఓటు వేశారు.

అనాడు అనుకూలంగా ఓటు వేసిన వారిలో సుప్రసిద్ధులు ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, పెండె వాసుదేశ్, మగ్ధుం మొహినుద్దీన్, ఉప్పల మల్సూర్ తదితరులున్నారు.
కాగా వ్యతిరేకంగా ఓటు వేసిన వారిలో ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు కొండా వెంకట రంగాడ్డి, సురవరం ప్రతాపడ్డి, సంగె లక్ష్మీబాయి, గోపాల్‌రావు ఎగ్బోటే, జీఎస్ మెల్కోటే, మెహదీ నవాజ్ జంగ్, ఎంఎస్ రాజలింగం, ముందుమల నర్సింగరావు, అరెగే రామస్వామి తదితరులున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.