విరాళాలు నొక్కేసిన అశోక్ బాబు

ఏపీఎన్జోవో నేత అశోక్ బాబు సమైక్యాంధ్ర పేరుతో వసూలు చేసిన విరాళాలను నొక్కేశారని  ఏపీఎన్జీవో మాజీ జనరల్ సెక్రటరీ సుబ్బారామన్, సతీష్ అన్నరు. అశోక్‌బాబు రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయడాన్ని తప్పుబట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాకుండా రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ సంఘంలో ఉంటారా లేక రాజకీయాల్లోకి వెళతారో సూటిగా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియం సభకోసం ఇచ్చిన కూపన్ డబ్బులేమాయ్యయని అడిగారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.