విభజన వ్యతిరేక పిటిషన్ల వెనుక సీఎం హస్తం: వివేక్

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ల వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉందని ఎంపీ వివేక్ ఆరోపించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన ఇష్టం లేకుంటే సీఎం తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలోకి వెళ్లిపోవాలని అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, సీమాంధ్ర సీఎంగా మాట్లాడటం సీఎం స్థాయికి తగినదికాదని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.