విభజన వేళ విషపు డబ్బాల గోల

సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచిందట. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమైందట. ప్రజలంతా రోడ్లమీదికి వచ్చారట. విద్యార్థులు నేతలపై ఒత్తిడి పెంచుతున్నరట. ఇదీ సీమాంధ్ర మీడియా విషప్రచారం. అఖిలపక్షం జరిగినప్పటి నుంచి సీమాంధ్ర మీడియా చేస్తున్న పిచ్చిప్రచారమిది. తెలంగాణ తేలుస్తరన్న సమయంలో ఆంధ్రా డబ్బాలు కుట్రలు చేస్తున్నయి. మూడు రోజుల సంది నుంచి ఈ మూర్ఖుల పైత్యం మరింత ముదిరింది.   జీ 24గంటలైతే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నంత పని చేస్తున్నది. ఎన్టీవీ, టీవీ9, టీవీ5, ఐ న్యూస్, సీవీఆర్ గోరంతను కొండంతచేసి చూపిస్తున్నయి. మిన్ను విరిగి మీదపడ్డట్టు బిల్డప్ ఇస్తున్నయ్. బేకార్ చానళ్లు. బేషరం నాయకులు చేసే షోకు సిగ్గులేకుండా హైప్ ఇస్తున్నయి.

ఏడున్నది సమైక్య ఉద్యమం. ఎంతమంది పాల్గొంటున్నరా ఉద్యమంల.  నిజాయితీ ఉంటె కెమెరా ప్యాన్ చేయండి. వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. జూమ్ చేసి చూపిస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడదు. సీమాంధ్ర నాయకులు, సీమాంధ్ర మీడియా అరిచిగోలపెట్టినంత మాత్రాన సీమాంధ్ర ప్రజలు సమైక్యవాదమనే ఉన్మాదంలో కొట్టుమిట్టాడరు. సీమాంధ్ర ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉంది. నాయకుల స్వార్థమేందో.. సీమాంధ్ర మీడియాకు వచ్చే లాభముందో వాళ్లకు ఎరికే.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

One Response to విభజన వేళ విషపు డబ్బాల గోల

  1. nagraju says:

    జి 24 గంటల చానల్‌ తెలంగాణపై విషం కక్కుతున్నది. శివప్రసాద్, జకీర్‌ చెమటోడ్చి మరీ తెలంగాణపై అక్కస్సు వెల్లబోసుకుంటున్నరు.