విభజన తర్వాత నక్సల్స్ సమస్య తలెత్తదు: షిండే

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో నక్సల్స్ సమస్య తలెత్తదని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నక్సలిజం సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్మూలించిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనపై కేబినెట్‌లో తమ సహచరులు వారి అభ్యంతరాలను తెలిపారని చెప్పారు. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల డిమాండ్ల కన్నా ప్రస్తుతానికి తమకు తెలంగాణ ఏర్పాటే ముఖ్యమని షిండే స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.