విభజన జరిగినా.. జల దోపిడీకి కుట్రలు

 తెలంగాణ జలవనరుల దోపిడీకి మరో కుట్ర జరుగుతున్నది. రాష్ట్రం విడిపోయినా తె లంగాణ నికరజలాలతో ప్రాజెక్ట్‌లు నిర్మించుకోకుండా ఆంక్షలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర విభజన క్రమంలో తెలంగాణ పరీవాహక ప్రాంతాల జలవనరులపై కూడా ఆజమాయిషీ చెలాయించడానికి సీమాంధ్ర నాయకులు పావులు కదుపుతున్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ నెపంతో చారివూతిక భద్రాచలంకే ఎసరుపెట్టే ప్రయత్నం జరుగుతుండగా మరోవైపు కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి, నిర్వహణకు రెండు కమిటీలను వేయాలని కేంద్ర మంత్రుల బృందంలో ఒకరైన జైరాంరమేశ్ తన నివేదికలో సూచించడం వివాదానికి దారితీస్తున్నది. అందులో ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంవూతులతో పాటు ఇరు రాష్ట్రాల అధికారులను కూడా సభ్యులుగా ఉంచడం కేంద్ర జలవనరుల మంత్రికి సర్వాధికారాలివ్వడం వంటి సిఫారసులు దుమారం రేపుతున్నాయి.

ఇంతవరకు తెలంగాణ పరీవాహక ప్రాంతంనుంచి యథేచ్ఛగా నీటి వనరులను తరలించుకుపోయిన సీమాంవూధులకు మళ్లీ పెత్తనమిస్తే మరింత అనర్థాలు జరుగుతాయని తెలంగాణ ప్రాంత ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో దాదాపు 66శాతం పరీవాహక ప్రాంతం ఉన్నా కేవలం 298 టీఎంసీల నీరు మాత్రమే లభిస్తున్నది. దానిలో కూడా దాదాపు 90టీఎంసీల నీరు సీమాంవూధకు తరలుతున్నదని లెక్కలు చెబుతున్నాయి. కృష్ణా పరీవాహకవూపాంతం నిష్పత్తిని బట్టి 550 టీఎంసీల నీరు తెలంగాణకు రావాల్సి ఉండగా, అందులో సగం కూడా దక్కడంలేదనే దానిపై చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణాజలాల పంపిణీకి ఒక పర్యవేక్షక బోర్డును వేయాలని తెలంగాణ ప్రాంతంలో డిమాండ్ ఉంది. దీనిపై కేంద్రమంవూతుల బృందానికి తెలంగాణ ఇంజినీర్ల ఫోరం మెమోరాండం సమర్పించింది. కానీ, కృష్ణా జలాలపై వివాదం ఉంటే గోదావరిని కూడా దానికి కలపడం సర్వోన్నత మండలికి పెత్తనం కట్టబెట్టాలన్న ప్రయత్నం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు.

నిజానికి గోదావరి నది జలాల్లో తెలంగాణకు 900 టీఎంసీలు కేటాయిస్తే 300 టీఎంసీలు మాత్రమే వినియోగంలోకి వస్తున్నాయి. గోదావరి నదిపై ఒక్క శ్రీరాంసాగర్ మాత్రమే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్‌గా ఉంది. కొత్తగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిగతా 600 టీఎంసీలను వినియోగంలోకి తీసుకురావడానికి కొన్ని ప్రాజెక్ట్‌లకు రూపకల్పన జరిగే పరిస్థితుల్లో, సీమాంవూధులకు పెత్తనమిస్తే తెలంగాణకు మళ్లీ అన్యాయం తప్పదని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం నెపంతో భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలిపితే అంతర్‌రాష్ట్ర జలవివాదాలు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలాల కేటాయింపే లేకుండా దొడ్డిదారిన నిర్మితమైన తెలుగుగంగ హంద్రీనీవా, గాలేరు, వెలిగొండ ప్రాజెక్ట్‌లను కూడా సర్వోన్నత మండలి పరిధిలోకి చేర్చి వాటికి కూడా నికరజలాల కేటాయింపులకు కుట్ర జరుగుతున్నదని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి మీరెడ్డి శ్యాంప్రసాద్‌డ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.