విభజనపై పూర్తి అధికారం కేంద్రానిదే: షిండే

తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపామని షిండే తెలిపారు. రాష్ట్రపతి అసెంబ్లీకి ఎంత సమయం ఇస్తారో తెలియదన్నారు. గత రెండు ఎన్నికల మేనిఫెస్టోలోనూ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామి ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోతే కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విభజనపై పూర్తి అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే విభజన జరుగుతుందన్నారు. అసెంబ్లీ నుంచి టీ బిల్లు కేబినెట్‌కు వస్తుందని పేర్కొన్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.