విభజనతో ఉత్తమ పరిపాలన సాధ్యం.. గణాంకాలతో వివరించిన అసోచాం

ఒకటి రెండు రంగాల్లో స్వల్ప మినహాయింపులు ఉన్న పరిశ్రమలు, వ్యవసాయం, సర్వీసులు, విద్యుత్, విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని, పురోగతిని కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలే కాకుండా.. వాటి మాతృ రాష్ట్రాలు సైతం సాధించాయని తన తాజా అధ్యయనంలో తెలిపింది. ఈ రాష్ట్రాలు ఏర్పడిన 2002-2003 నుంచి 2012-2013 కాలంలో అభివృద్ధిని రాష్ట్రాలు ఏర్పడకు ముందు 1994-1995 నుంచి 2003-2004 మధ్యకాలంలో ఉన్న అభివృద్ధితో పోలుస్తూ వివిధ ముఖ్య రంగాల్లో ప్రగతిని అసోచాం అధ్యయనం సమీక్షించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతున్న తరుణంలో ఉత్తరవూపదేశ్-ఉత్తరాఖండ్, మధ్యవూపదేశ్-ఛత్తీస్‌గఢ్, బీహార్-జార్కండ్ రాష్ట్రాల్లో అభివృద్ధిపై అధ్యయనం చేసినట్లు వివరించింది. ఈ అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వంలోని గణాంకాలు, పథకాల అమలు శాఖ ఇచ్చిన వివరాలను ఉపయోగించింది.

ఆర్థికరంగం
కొత్తగా ఏర్పడిన మూడు రాష్ట్రాలు, వాటి మాతృరాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అందించిన వాటాను వివరిస్తూ, విభజనకు ముందు ఈ మూడు అవిభాజ్య రాష్ట్రాల వాటా స్థూల జాతీయోత్పత్తిలో 18.6శాతం ఉంటే.. విభజన తర్వాత అది 19.8 శాతానికి పెరిగిందని పేర్కొంది. విభజనకు ముందు బీహార్, జార్ఖండ్‌ల ఆర్థిక వృద్ధిరేటు వరుసగా 10.0%, 9.1%గా ఉంటే .. విభజన తర్వాత వరుసగా 18.8%, 13.3%కి పెరిగిందని తెలిపింది. విభజన నేపథ్యంలో ప్రధాన పరిక్షిశమలు, వనరులు జార్ఖండ్‌కు వెళ్లిపోయినా.. బీహార్ రాష్ట్రం గణనీయమైన పురోగతిని ప్రదర్శించింది. మధ్యవూపదేశ్ విషయానికి వస్తే.. విభజనకు ముందు మధ్యవూపదేశ్ ఆర్థిక వృద్ధిరేటు 9.4%, ఛత్తీస్‌గఢ్ వృద్ధిరేటు 10.7%గా ఉంటే..

విభజన తర్వాత ఈ రెండు రాష్ట్రాల వృద్ధి రేటు వరుసగా 15.7శాతం, 16.3శాతాలకు పెరిగింది. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల వృద్ధి రేటు విభజనకు పూర్వకం దేశ సగటుకు దిగువన ఉంటే.. విభజన తర్వాత దేశ సగటును మించిపోయాయి. ఉత్తరవూపదేశ్ వృద్ధిరేటు 1995-96నుంచి 2003-04 మధ్యకాలంలో 9.2శాతం, జార్ఖండ్ వృద్ధి రేటు 11.0 శాతంగా ఉంటే.. విభజన జరిగి జార్ఖండ్ విడిపోయిన తర్వాత యూపీ వృద్ధిరేటు 14.5శాతానికి పెరిగితే.. జార్ఖండ్ వృద్ధి గణనీయంగా 20.2శాతానికి పెరిగింది. మూడు మాతృ రాష్ట్రాలు, వాటి నుంచి విడిపోయిన మరో మూడు రాష్ట్రాల్లో గతంకంటే వృద్ధి రేటు పెరిగినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని అసోచాం నివేదికలో స్పష్టం చేసింది.

వ్యవసాయం
ఈ ఆరు రాష్ట్రాలూ దేశ వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తుల్లో జాతీయ స్థాయిలో నాలుగో వంతును అందజేయగలుగుతున్నాయని పేర్కొంది. ఇది విభజన తర్వాత మరింత వేగవంతమైందని తెలిపింది. ఒక్క ఛత్తీస్‌గఢ్ మినహా ఆరు రాష్ట్రాలూ 1995-96 నుంచి 2003-04 మధ్యకాలంలో ఏక అంకె వృద్ధిని వ్యవసాయం రంగంలో సాధించగా.. విభజన తర్వాత రెండంకెల వృద్ధికి ఎదిగాయని పేర్కొంది.

పారిక్షిశామికరంగం
భారత ఆర్థికరంగంకోణంలో చూస్తే పారిక్షిశామికరంగం కూడా ముఖ్యమైన రంగాల్లో ఒకటి. ఆరు రాష్ట్రాలు.. విభజన జరిగిన 2000-01లో ఉమ్మడిగా పారిక్షిశామికరంగానికి 17.6శాతం వాటా అందిస్తుండగా.. విభజన జరిగిన తర్వాత ఆ వాటా ఏకంగా 22.2శాతానికి పెరిగిందని అసోచాం లెక్కలు చెప్పింది. బీహార్ పారిక్షిశామిక వృద్ధి రేటు విభజనకు ముందు 12.1 శాతం ఉండగా.. విభజన తర్వాత అది ఏకంగా 24.2 శాతానికి పెరిగిందని తెలిపింది. అదే సమయంలో బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ పారిక్షిశామిక వృద్ధి రేటు 8.1 శాతం నుంచి 10.2 శాతానికి చేరుకోగలిగిందని పేర్కొంది. మధ్యవూపదేశ్ విషయంలో ఒకప్పుడు 8.5శాతంగా ఉన్న వృద్ధిరేటు.. విభజన తర్వాత 15.9శాతంగా ఉందని తెలిపింది.

ఛత్తీస్‌గఢ్ పారిక్షిశామిక వృద్ధిరేటు విభజన సమయంలో 10.5శాతంగా ఉంటే.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 14.9శాతానికి పెరిగింది. ఇది దేశ పారిక్షిశామిక వృద్ధిరేటు కన్నా అధికమని వివరించింది. యూపీ పారిక్షిశామిక వృద్ధిరేటు విభజనకు ముందు 8.2శాతం ఉంటే.. విభజన తర్వాత అది 13.4శాతానికి పెరిగింది. ఉత్తరాఖండ్ విషయంలో విభజన సమయంలో 13.2శాతంగా ఉన్న పారిక్షిశామిక వృద్ధిరేటు సొంత రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఏకంగా 24.0 శాతానికి పెరిగింది. ప్రాదేశిక ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ఈ స్థాయి వృద్ధిరేటును చిన్న రాష్ట్రమైన ఉత్తరాఖండ్ సాధించడం గమనార్హం.

తలసరి ఆదాయం
ఒక మనిషి మెరుగైన జీవనాన్ని తలసరి ఆదాయంతో లెక్కిస్తారు. దీని వల్ల ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం, మౌలిక వసతుల వంటివాటిలో మెరుగైన జీవనం ఉంటుంది. ఈ విషయంలోనూ విభజన తర్వాత ఆరు రాష్ట్రాల్లో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. విభజన తర్వాత ఉత్తరాఖండ్, బీహార్ తలసరి ఆదాయం జాతీయ సగటుకంటే అధికంగా ఉంది. మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్ విషయంలో దేశ సగటుకు దాదాపు సమానంగా ఉంది. అయితే ఉత్తరవూపదేశ్, జార్ఖండ్ తలసరి ఆదాయం మాత్రం జాతీయ సగటుకంటే తక్కువగా ఉంది. బీహార్ తలసరి ఆదాయం వృద్ధిరేటు 7.3శాతం నుంచి 17.3శాతానికి పెరిగింది. జార్ఖండ్‌లో 7.2% నుంచి 11.2%కి, మధ్యవూపదేశ్‌లో 7.3% నుంచి 13.9%కి, ఛత్తీస్‌గఢ్‌లో 9.1శాతం నుంచి 13.9శాతానికి, యూపీలో 6.7శాతం నుంచి 12.5శాతానికి, ఉత్తరాఖండ్‌లో 8.6శాతం నుంచి 17.9శాతానికి తలసరి ఆదాయం వృద్ధిరేటు పెరిగింది. ఒక్క ఉత్తరవూపదేశ్ మినహాయిస్తే మిగిలిన ఐదు రాష్ట్రాల్లోనూ గ్రామీణ తలసరి ఆదాయం పెరుగుదల నమోదు చేసింది.

This entry was posted in ARTICLES.

Comments are closed.