విధేయత, వినమ్రత.. ఫర్ ఫెక్ట్ ఆన్సర్ .. సీనియర్ నేతల ప్రశంసలు పొందుతున్న మంత్రి కేటీఆర్

విధేయత.. వినమ్రత  ..  మంత్రినన్న అహంకారం సభలో ఇసుమంతైనా ప్రదర్శించడం లేదు.. సీనియర్ సభ్యులను గౌరవిస్తున్నడు.   సుదీర్ఘ ప్రసంగంతో సుత్తివేయకుండా అడిగిన ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ చేస్తున్నడు.  అటు అసెంబ్లీలో.. ఇటు మండలిలో రాము ఎంతో ఓపికతో సమాధానం చెప్తున్నడు.  సీనియర్ సభ్యులు వేసే ప్రశ్నలకు  వినమ్రపూర్వకంగా సమాధానాలిస్తున్నరు. ఇది పోరు తెలంగాణ కొడుతున్న డబ్బాకాదు.  కేటీఆర్ గురించి సీనియర్ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలివి. బడ్జెట్ సెషన్స్ లో మంత్రి కేటీఆర్ తీరు సీనియర్ సభ్యులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. సీనియర్ నేతలు  జానారెడ్డి, డీఎస్, ప్రొ.నాగేశ్వర్ లాంటి నేతలు సభలోనే కేటీఆర్ ను మెచ్చుకున్నరు. బుధవారం జరిగిన సెషన్స్ లో ఓ ప్రశ్నకు సభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా  కేటీఆర్ కల్పించుకుని సమాధానం ఇవ్వడంతో  ప్రొ.నాగేశ్వర్, డీఎస్ శాంతించిన్రు. మంత్రులంటే అధికారదర్పం చూపెట్టేందుకు ప్రయత్నించొద్దు.. కేటీఆర్ లాగా సమాధానం చెప్పాలని కొనియాడిన్రు.

వితండవాదానికి దిగే ఎమ్మెల్సీ రంగారెడ్డి, రేవంత్, ఎర్రబెల్లి లాంటివారికి మాత్రం కేటీఆర్ ధీటైన సమాధానాలిస్తున్నరు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.