విద్యుత్ లేకపోతే ఏదీలేదు: కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం చాలా ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు.  విద్యుత్ లేకపోతే పరిశ్రమలుండవు, ఐటీ ఉండదు, హైదరాబాద్ ఉండదని తెలిపారు. అందుకే విద్యుత్ విషయంలో, నీటి సరఫరా విషయంలో కచ్చితంగా, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్నటువంటి వాతావరణం ఎక్కడాలేదని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలకు అనువైన మంచి వాతావరణం కల్పిస్తే పెట్టుబడులు కచ్చితంగా వస్తాయన్నారు. పరిశ్రమల యజమానులకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత నేతలపై ఉందని వివరించారు. పరిశ్రమల అభివృద్ధి ఆగకుండా చూసుకోవాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.