విద్యుత్‌సౌధలో ఉద్రిక్తత

తెలంగాణ, సీమాంధ్ర
ఉద్యోగుల మధ్య హోరాహోరీ
పరకాల ప్రభాకర్‌ను
అరెస్టు చేయాలని డిమాండ్
తెలంగాణను అడ్డుకునే కుట్ర
సీఎం క్యాంపు ఆఫీస్ నుంచే…
ధ్వజమెత్తిన
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్
– తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య హోరాహోరీ
– పరకాల ప్రభాకర్‌ను అరెస్టు చేయాలి
union– సెటిలర్స్ ఫోరమ్ ఛైర్మన్ కాట్రగడ్డ ప్రసూన డిమాండ్
– తెలంగాణను అడ్డుకునే కుట్ర సీఎం క్యాంపు ఆఫీస్ నుంచే…
– చంవూదబాబు, కిరణ్, జగన్‌లు ఆంధ్రా బాబులే: కేటీఆర్
– హైదరాబాద్ ముమ్మాటికీ మాదే : బీజేపీ నేత రాజేశ్వర్‌రావు
విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర పోలీసులు మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న తెలంగాణ వాదులను అక్కడినుంచి బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించి దాష్టీకానికి పాల్పడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పరకాల ప్రభాకర్ రావడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ ఉద్యోగులను ఈడ్చేశారు. పోలీసులు తెలంగాణ వాదులను అరెస్టు చేస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి చామకూర సుధాకర్‌డ్డి అడ్డుకుని తెలంగాణ వాదులను విడిపించారు. పరకాల ప్రభాకర్ విద్యుత్ సౌధకు రావటాన్ని నిరసిస్తూ సెటిలర్స్ ఫోరమ్ చైర్మన్ కాట్రాగడ్డ ప్రసూన ప్రధాన గేట్ ముందు నిరసనకు దిగారు.

సీఎం క్యాంపు ఆఫీస్‌నుంచే తెలంగాణపై కుట్ర: కేటీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా తెలంగాణను అడ్డుకునే కుట్రలు సాగుతున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రాన్స్‌కో జేఎండీ పై సీమాంధ్ర ఉద్యోగుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిర్వహించిన ధర్నా నుద్దేశించి ఆయన మాట్లాడారు. ఆంధ్రవూపదేశ్ సీఎంగా రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన కిరణ్‌కుమార్‌డ్డి కేవలం సీమాంధ్ర ప్రాంతానికే సీఎంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. సీఎంను కలిసిన తర్వాతే ఏపీఎన్జీవోలు ఉద్యమంలోకి అడుగుపెట్టారని ఆరోపించారు. సీఎంకిరణ్, చంద్రబాబు, వైయస్ జగన్‌లు ఆంధ్రబాబులమేనని మరోసారి నిరూపించారని విమర్శించారు. వారు తమ స్వీయ మానసిక ఆందోళనలను ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు.

సీమాంధ్ర ఉద్యమం కన్నా వెయ్యి రేట్లు ఎక్కువగా ఉన్న సకలజనుల సమ్మె కాలంలో గానీ, విద్యార్థులు చనిపొయిన విషయాలను గానీ ఏనాడూ ప్రశ్నించని చంద్రబాబుకు నేడు సీమాంవూధ ఉద్యమం కనిపిస్తున్నదంటే ఆయన బుద్ది సీమాంధ్ర బుద్దేనని స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పిన వైసీపీ ఏకంగా రాష్ట్రాన్ని విభజించకూడదని ఆమరణ దీక్షకు దిగటంతో వారి నైజం బయట పడిందని ఆక్షేపించారు. చంద్రబాబు ఒక వేళ నిజంగానే తెలంగాణకు కట్టుబడి ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని సస్పెండ్ చేయించగలరా అని ప్రశ్నించారు. విశాలాంధ్ర మహాసభ పేరుతో వచ్చిన పరకాల ప్రభాకర్ వెంట నలుగురు ఉండకపోయినా తానో పెద్ద నాయకున్ని అనుకుంటారని ఎద్దేవా చేశారు. అసలు ఆయన ఇంట్లోనే తెలంగాణ వాదానికి మద్దతు ఉన్నదని, ముందుగా నీ ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో రక్షణ లేదని చెప్పి దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్న వారు తిరుపతిలో ఏకంగా రాజ్యసభ సభ్యుడిపైననే గాంధీగిరి అని చెప్పి కిందకు దిగిన తర్వాత కొడిగుడ్లతో, చెప్పులతో కొట్టారని, అక్కడ మాకు రక్షణ లేనందున దానిని యూటీగా, విజయవాడలో మా ఉద్యోగులకు రక్షణ లేనందున విజయవాడను యూటీగా మార్చాలని డిమాండ్ చేశారు. సమైక్య ఉద్యమం అంటే 13 జిల్లాల ఉద్యమమేనని గుర్తుంచుకోవాలన్నారు. ఇక సీమాంధ్ర మీడియా పరిస్థితిని చూస్తే ఆదివారం కూడా సమ్మె ఉధృతంగా కొనసాగుతుందని గింత ఇజ్జత్ లేకుండా ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

హైదరాబాద్ కోసమే సమైక్య ఉద్యమం: బీజేపీ నేత రాజేశ్వర్‌రావు
సమైక్య ఉద్యమం కేవలం హైదరాబాద్ కోసమే జరుగుతుందని , హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే సీమాంధ్ర ప్రాంత నాయకులకు భాషా ప్రయుక్త రాష్ట్రం గుర్తుకు రాదని బీజేపీ నేత రాజేశ్వర్‌రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ముమ్మాటికి మాదేనని స్పష్టం చేశారు.. తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ అధ్యక్షుడు డీ పీ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతాన్ని తెలంగాణలో కలిపే సమయంలో హైదరాబాద్‌ను కబ్జా చేయాలనే కుట్రలతోనే కలిశారని విమర్శించారు. న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ రంగారావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నాయని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు మనం అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయ కర్త కే రఘు మాట్లాడుతూ పరకాల ప్రభాకర్ ఓ జోకర్ అని విమర్శించారు. ఈ కార్యక్షికమంలో టీఆర్‌ఎస్వీ అధ్యక్షులు బాల్క సుమన్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి చామకూర సుధాకర్‌డ్డి, నాయకులు ఆర్వీ మహేందర్, మన్నె గోవర్ధన్‌డ్డి న్యాయవాదులు పులిగారి గోవర్ధన్‌డ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.