విద్యార్థుల పోరాటం వీరోచితం

తెలంగాణ విద్యార్థుల వీరోచిత పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడానికి సీడబ్ల్యూసీ ప్రకటన చేసిందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ‘సకల జన భేరి’ విజయవంతం చేయడానికి తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిజామాబాద్‌లో సన్నాహాక సభను నిర్వహించనున్నామని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం టీ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో హరీశ్‌రావు, కరపవూతాన్ని కోదండరాం ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుని 50 రోజులు గడిచినా సీమాంవూధుల కృత్రిమ ఉద్యమంతో కేంద్రం నాన్చివేత ధోరణిని అవలంబిస్తోందని మండిపడ్డారు.
tpjac1

టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర పెట్టుబడిదారులు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అని, తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి ఆత్మ శాంతించాలంటే కేంద్రం వెనక్కి వెళ్ళకూడదని పేర్కొన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేవరకు విద్యార్థులు, తెలంగాణ సమాజం ఉధృతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 26న నిజామాబాద్‌లో జరిగే విద్యార్థుల సదస్సుకు విద్యార్థులు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్షికమంలో తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ అక్షయ్‌కుమార్, టీపీజేఏసీ కన్వీనర్ మురళీధర్‌గుప్తా, పాలా లెక్చరర్ల సంఘం నాయకులు మనోహర్‌డ్డి, నర్సయ్యగౌడ్, రాజా, శ్రవణ్‌కుమార్, చక్రవర్తి, లక్ష్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.