విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్‌ల ధర పెంపు

హైదరాబాద్: విద్యార్థులకు ఇచ్చే బస్‌పాస్‌ల ధరలు పెంచాలన్న ఆర్టీసీ ప్రతిపాదనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో విద్యార్థులకు ఇచ్చే రాయితీలో ప్రభుత్వం కోత విధించింది. ప్రభుత్వం ఇప్పటి దాకా ఇస్తున్న 90 శాతం రాయితీని 66.7 శాతానికి తగ్గించింది. విద్యార్థులు చెల్లించే మొత్తం 10 శాతం నుంచి 33 శాతానికి పెంచింది. రాయితీ కోతతో విద్యార్థులపై రూ. 200 కోట్ల మేరకు అదనపు భారం పడనుంది. పెంచిన ధరలను జూన్ 1 నుంచి అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.